EPFO: పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్.. వడ్డీ రేటు తగ్గింపు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించినట్లు ఈపీఎఫ్‌ఓ రిటైర్మెంట్ ఫండ్ బాడీ గురువారం వెల్లడించింది. దీంతో పీఎఫ్ అకౌంట్‌పై సబ్‌స్క్రైబర్లకు తక్కువ వడ్డీ రానుంది.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్.. వడ్డీ రేటు తగ్గింపు!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 3:33 PM

EPFO: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతానికి తగ్గించినట్లు ఈపీఎఫ్‌ఓ రిటైర్మెంట్ ఫండ్ బాడీ గురువారం వెల్లడించింది. దీంతో పీఎఫ్ అకౌంట్‌పై సబ్‌స్క్రైబర్లకు తక్కువ వడ్డీ రానుంది. ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ తాజాగా ఈపీఎఫ్ అకౌంట్‌పై 8.5 శాతం వడ్డీ అందించాలని ప్రతిపాదించింది. ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ మీడియా తెలిపారు. కాగా ఇది ఐదేళ్లలో కనిష్ట వడ్డీ రేటు కావడం గమనార్హం.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పో స్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు వంటి ప్రభుత్వం నడుపుతున్న ఇతర చిన్న పొదుపు పథకాలతో ఈపిఎఫ్ వడ్డీ రేటును సమం చేసినందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్మిక మంత్రిత్వ శాఖను తప్పుపట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గారూ ఈ వడ్డీ రేటు అందించాలని ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించింది. దీంతో 6 కోట్లకు పైగా ఈపీఎఫ్‌వో సబ్‌స్క్రైబర్లపై నేరుగానే ప్రతికూల ప్రభావం పడనుంది.

ఇప్పుడు, కార్మిక మంత్రిత్వ శాఖకు ఈ విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క సమ్మతి అవసరం. కార్మిక శాఖ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది. తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలకు ఓకే చెప్పాలి. అప్పుడు తగ్గింపు వడ్డీ రేటు అమలులోకి వస్తుంది. లేదంటే లేదు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్ అకౌంట్‌పై 8.65 శాతం వడ్డీ రేటు లభిస్తోంది.