వాళ్ల డిజిటల్ సంతకం ఈ-మెయిల్‌లో పంపండి: ఈపీఎఫ్‌ఓ

కరోనా వేళ రిటైర్మెంట్ ఫండ్ బాడీ సంస్థల యజమానులు తమ డిజిటల్ సంతకాన్ని ఈ-మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్‌ఓ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకునే సమయంలో ఈ సమస్యలు తలెత్తుతున్న తరుణంలో..

వాళ్ల డిజిటల్ సంతకం ఈ-మెయిల్‌లో పంపండి: ఈపీఎఫ్‌ఓ
Follow us

| Edited By:

Updated on: May 07, 2020 | 5:19 PM

కరోనా వేళ రిటైర్మెంట్ ఫండ్ బాడీ సంస్థల యజమానులు తమ డిజిటల్ సంతకాన్ని ఈ-మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్‌ఓ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకునే సమయంలో ఈ సమస్యలు తలెత్తుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మెయిల్‌ను ఉపయోగించుకొని ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) అనుమతించింది. ఇప్పటివరకూ డిజిటల్ సంతకాన్ని సంబంధిత సంస్థల ప్రతినిధులు నేరుగా ఈపీఎఫ్‌ఓ కార్యాలయాలకు వెళ్లి రిజిస్టర్ చేసేశారు. కానీ ఇప్పుడు ఆన్‌లైన్ ద్వారా పంపే వీలు కల్పించినట్లు కేంద్ర కార్మికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

లాక్ డౌన్ కారణంగా ఆయా సంస్థల యజమానులు ఆఫీసు కార్యాలయాలకు వెళ్లే వీలు లేదు. దీంతో ప్రస్తుతం నెలకొన్న అడ్డంకుల కారణంగా ఆయా సంస్థల యజమానులు తమ డిజిటల్ సంతకాలను ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో నమోదు చేయించుకునేందుకు సమస్యలు వస్తున్నందన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ పేర్కొంది. WWW.epfindia.gov.in మెయిల్‌కి సంబంధిత డిజిటల్ సంతకాలు పంపాలని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.

Read More:

బ్రేకింగ్: మృతుల కుటుంబాలకి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన జగన్

లాక్‌డౌన్: ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు కడితే చాలట