పర్యావరణ పరిరక్షణే ధ్యేయం.. : కిషన్ రెడ్డి

World Environment Day, పర్యావరణ పరిరక్షణే ధ్యేయం.. : కిషన్ రెడ్డి

పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలోని బీఎస్ఎఫ్ ఇనిస్టిట్యూట్‌లో ఆయన మొక్కను నాటి పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణం ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందన్నారు కిషన్ రెడ్డి. కచ్ లాంటి ఎడారి ప్రాంతంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో మన జవాన్లు విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఆ ప్రాంతాల్లో చెట్లను పెంచి పచ్చదనాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *