పర్యావరణం వెర్సస్ ఆర్థిక అంతరాయం..ప్లాస్టిక్ బ్యాన్ విషయంలో నలిగిపోతున్న బీజేపీ

రోజువారి జీవన విధానంలో భాగంగా వివిధ రూపాల్లో పెరిగిన ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు స్వీయ నియంత్రణ కీలకంగా మారింది. ప్రధానంగా ఒకసారి వాడి పారేసే ‘యూజ్‌ అండ్‌ త్రో’, ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’వస్తువులతోనే సమస్య తీవ్రత పెరిగింది. దళసరికాగితం, నార(జ్యూట్‌), గుడ్డలతో తయారు చేసిన సంచుల ద్వారా ప్రస్తుతం సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌కు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులకు చెక్‌ చెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకసారి వినియోగించిన ప్లాస్టిక్‌ సీసాలు, ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుండడంతో […]

పర్యావరణం వెర్సస్ ఆర్థిక అంతరాయం..ప్లాస్టిక్ బ్యాన్ విషయంలో నలిగిపోతున్న బీజేపీ
Follow us

|

Updated on: Oct 03, 2019 | 5:51 AM

రోజువారి జీవన విధానంలో భాగంగా వివిధ రూపాల్లో పెరిగిన ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగాన్ని తగ్గించేందుకు స్వీయ నియంత్రణ కీలకంగా మారింది. ప్రధానంగా ఒకసారి వాడి పారేసే ‘యూజ్‌ అండ్‌ త్రో’, ‘సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌’వస్తువులతోనే సమస్య తీవ్రత పెరిగింది. దళసరికాగితం, నార(జ్యూట్‌), గుడ్డలతో తయారు చేసిన సంచుల ద్వారా ప్రస్తుతం సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌కు, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులకు చెక్‌ చెప్పే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకసారి వినియోగించిన ప్లాస్టిక్‌ సీసాలు, ఇతర వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేస్తుండడంతో వాటి వల్ల పర్యావరణానికి, జీవవైవిధ్యానికి ఎక్కువ నష్టం జరుగుతోంది.

అందుకే గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ఆరురకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేదిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు అన్నీ చోట్ల ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేస్తామని పేర్కొన్నారు. 2022 వరకు ప్లాస్టిక్ రహిత దేశం ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇదివరకే ప్రధాని మోడీ చెప్పారు.

అయితే బుధవారం నుంచి దేశవ్యాప్తంగా ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులను(సింగిల్ యూజ్ ప్లాస్టిక్)  పూర్తిగా నిషేధించాలన్న తన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. అసలే ఆర్థిక మందగమనం, ఉద్యోగాల తొలగింపు వంటి అంశాలు దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక రంగానికి ప్లాస్టిక్ వస్తువుల నిషేధాన్ని అమలు చేయడం వల్ల ఆ రంగానికి తీవ్ర విఘాతం ఏర్పడగలదన్న ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదనను రద్దు చేసినట్లు పర్యావరణ మంత్రిత్వశాఖలోని సీనియర్ అధికారి చంద్ర కిశోర్ మిశ్రా వెల్లడించారు. ఈ నిర్ణయం పారిశ్రామిక కుదుపుకు కారణమవుతుందనే నిర్ణయాన్ని ఆయన వెలిబుచ్చారు.  ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిళ్లు, స్ట్రాలు, కొన్ని రకాల సాచెట్లపై ఇప్పట్లో నిషేధం ఉండదని ఆయన చెప్పారు. అయితే, నిషేధం విధించనప్పటికీ వీటి వాడకాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూాడా ఇందుకు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.