ప్రతిపక్షాలన్నీ ఐసీయూలో చేరాయన్న కేంద్రమంత్రి

ఎన్నికల కోడ్‌ మొదలైనప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిల్చిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్.. మరో సారి తననోటికి పదునుపెట్టారు. ఆదివారం ర చివరి విడత సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ సారి కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయేకే ప్రజలు పట్టం కట్టారని అన్ని సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన విపక్షాలను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఈసారి కూడా ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ తేల్చాయని.. ఈ ఫలితాలు మింగుడు పడక విపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయంటూ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసిన తర్వాత మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు సహా విపక్షాలన్నీ రాజకీయ పరంగా ఐసీయూలో చేరాయని ట్వీట్‌లో పేర్కొన్నారు. కొందరైతే ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తప్పని అంటున్నారని అన్నారు. ఇప్పుడు ఇవి తప్పు కావచ్చు.. కానీ మే 23న అసలైన ఫలితాలు వచ్చినప్పుడు తెలుస్తుందని.. నాకు తెలిసి భవిష్యత్తులో వారేం చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకుంటే మంచిదంటూ ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *