దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు సభ్యుల రాజీనామా

సౌత్ ఆఫ్రీకా క్రికెట్ బోర్డ్ మరింత సంక్షోభంలో కురుకుపోయింది. బోర్డు డైరెక్టర్లు మొత్తం మంది ఒకేసారి రాజీనామా చేశారు. బోర్డు వ్యవహారాల్లో క్రీడా మంత్రి జోక్యం చేసుకోవడానికి ఒక్క రోజు ముందు ఈ పరిణామాలు చోటు….

  • Sanjay Kasula
  • Publish Date - 9:48 pm, Mon, 26 October 20

Cricket South Africa’s Board Resigns : సౌత్ ఆఫ్రీకా క్రికెట్ బోర్డ్ మరింత సంక్షోభంలో కురుకుపోయింది. బోర్డు డైరెక్టర్లు మొత్తం మంది ఒకేసారి రాజీనామా చేశారు. బోర్డు వ్యవహారాల్లో క్రీడా మంత్రి జోక్యం చేసుకోవడానికి ఒక్క రోజు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండిపెండెంట్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లు మొత్తం రాజీనామా చేసినట్టు క్రికెట్ సౌతాఫ్రికా ట్విట్టర్ ద్వారా పేర్కొంది. రాజీనామాలు తక్షణం ఆమోదం పొందినట్టు వెల్లడించింది. అయితే, బోర్డు కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు తాత్కాలిక కమిటీని నియమించే వరకు ముగ్గురు డైరెక్టర్లు మాత్రం కొనసాగుతారని పేర్కొంది.

ఆదివారం బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు బెరెస్‌ఫోర్డ్ విలియమ్స్ సహా ఆరుగురు బోర్డు సభ్యులు రాజీనామా చేయగా…  24 గంటలైనా గడవకముందే బోర్డు మొత్తం రాజీనామా చేయడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. మిగిలిన నలుగురు బోర్డు సభ్యుల రాజీనామాతో తాత్కాలిక కమిటీ నియామకానికి రూట్ క్లీయర్ అయ్యింది. బోర్డు వ్యవహారాల్లో క్రీడామంత్రి నాథి ఎంథెథ్వా జోక్యం చేసుకోవడానికి ఒక రోజు ముందు ఇలా జరగడం గమనార్హం.