చౌకలో అమ్మకానికో గ్రామం ! ఎక్కడో చెప్పుకోండి చూద్దాం ?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. లాక్ డౌన్ వల్ల మార్కెట్లు కుదేలయ్యాయి. కానీ పూర్తిగా లాక్ డౌన్ ఎఫెక్ట్ కి గురి కాని స్వీడన్ కి వెళ్తే అక్కడ ఓ విచిత్ర ప్రకటన కనిపిస్తుంది....

చౌకలో అమ్మకానికో గ్రామం ! ఎక్కడో చెప్పుకోండి చూద్దాం ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 30, 2020 | 1:38 PM

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది. లాక్ డౌన్ వల్ల మార్కెట్లు కుదేలయ్యాయి. కానీ పూర్తిగా లాక్ డౌన్ ఎఫెక్ట్ కి గురి కాని స్వీడన్ కి వెళ్తే అక్కడ ఓ విచిత్ర ప్రకటన కనిపిస్తుంది. 18 వ శతాబ్దం నాటి ‘సత్రా బ్రన్’ అనే గ్రామాన్ని ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. స్వీడన్ రాజధాని స్టాక్ హామ్ శివార్లలో సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గ్రామాన్ని 7.3 మిలియన్ డాలర్లకు అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పుడో పద్దెనిమిదో శతాబ్దంలో శామ్యూల్ స్కరాగ్గీ అనే డాక్టర్ ఈ గ్రామాన్ని ‘కనుగొన్నాడు’. ఇక్కడ నీటివనరులు బాగా ఉన్నాయని గ్రహించి ఆయన ఓ బావి తవ్వాడని, కొన్ని ఇళ్లు నిర్మించాడని చెబుతారు. ఆ తరువాత ఓ హాస్పిటల్, చర్చి కూడా ఈ గ్రామంలో వెలిశాయి.

ఆశ్చర్యంగా సత్రా బ్రన్ గ్రామంలోని నీటికి వ్యాధులను నయం చేసే పవర్ ఉందని ప్రచారం జరిగింది. ఇక్కడి చల్లటి, వేడి నీటిని తాగడం వల్లఎమోషనల్ ఇంబ్యాలన్సులు కూడా క్రమంగా మటుమాయమవుతాయట..ఇలాంటి ప్రచారాలతో ఈ గ్రామ పాపులారిటీ పెరిగిపోయింది. స్వీడన్ లో అత్యంత శుద్ది నీరు గల ఈ గ్రామం ఇదే అనే వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఇంత జరిగినా ఇప్పుడు ఈ గ్రామాన్ని అమ్మకానికి ఎందుకు పెట్టారో తెలియడంలేదు. బడా బాబులెవరైనా ఈ గ్రామాన్ని ఇంత సొమ్ము పెట్టి కొంటారేమో చూడాలి.