Beast vs KGF 2 : బాక్సాఫీస్ వార్.. కేజీఎఫ్ 2 ధాటికి దళపతి బీస్ట్ నిలిచేనా..

ఇద్దరు పెద్ద స్టార్స్.. రెండు బడా సినిమాలు..ఒక్క రోజు గ్యాప్. దళపతి బీస్ట్, యష్ కేజీఎఫ్ 2 రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి.

Beast vs KGF 2 : బాక్సాఫీస్ వార్.. కేజీఎఫ్ 2 ధాటికి దళపతి బీస్ట్ నిలిచేనా..
Beast Vs Kgf 2
Follow us

|

Updated on: Apr 14, 2022 | 7:10 PM

ఇద్దరు పెద్ద స్టార్స్.. రెండు బడా సినిమాలు..ఒక్క రోజు గ్యాప్. దళపతి బీస్ట్(Beast), యష్ కేజీఎఫ్ 2(KGF 2) రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. బుధవారం (13న ) బీస్ట్, గురువారం (14న ) కేజీఎఫ్ 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ రా ఏజెంట్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. మాస్టర్ సినిమా హిట్ అవ్వడంతో బీస్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను దళపతి బీస్ట్ అందుకుందనే చెప్పాలి. కానీ ఆ వెంటనే వచ్చిన కేజీఎఫ్ బీస్ట్ కలెక్షన్స్ పై దెబ్బకొట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో కేజీఎఫ్ 2 పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతకు మించి సినిమా ఉండటంతో కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

విజయ్‌ ఓ కొత్త సినిమా చేయడం ఆయన ఫ్యాన్స్ కు ఓ సంబంరం.. అది కూడా సెన్సబుల్ డైరెక్టర్ నెల్సన్ కుమార్ డైరెక్షన్లో చేయడం వారికి విపరీతమైన ఆనందం.. ఇక రిలీజ్‌కు ముందు అరబిక్ బీస్ట్ సాంగ్ సూపర్ డూపర్ హిట్టవడం.. వారికెంతో ఆహ్లాదం..! కాని సినిమా రిలైజయ్యాక మాత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటుంది. కొంతమంది సినిమా సూపర్ అంటుంటే మరికొంతమంది అనుకున్నంత లేదు అంటున్నారు. అంతేకాదు దీనికి కారణంగా చేస్తూ.. మరో హీరో రాఖీభాయ్ ను నిందిస్తున్నారు. ఏదోలా మరో రెండు రోజుల్లో సినిమా సెట్ అవుతుంది.. టాక్ మారుతుంది అని అనుకుంటున్న దళపతి ఫ్యాన్స్‌కు కేజీఎఫ్ 2 సూపుర్ డూపర్ హిట్టనే టాక్ మింగుడు పడడం లేదు. ఈ సినిమా వల్ల తమ హీరో సినిమా ఎక్కడ థియేటర్లలో లేకుండా పోతుందోనిని వారు ఫీలవుతున్నారు. ఇక యష్ ఫ్యాన్స్ మాత్రం వీరి బాధను ఫన్నీ మీమ్స్‌ తో నెట్టింట వైరల్‌ చేస్తున్నారు. బీస్ట్ బీటెన్ బై రాఖీభాయ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కలెక్షన్స్ విషయంలోనూ బీస్ట్ కు కేజీఎఫ్ అడ్డంకి గా మారుతుందని అంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Anasuya Bharadwaj: నీలిరంగు చీరలోనా చందమామ నీవే జాణ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్