AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10: బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ.. ఆ సీరియల్ నటి ఈసారి హౌస్‌లో సందడి చేయనుందా.?

టీవీ ఆడియెన్స్ ఫేవరెట్ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వివాదాలు, గొడవలు ఉన్నప్పటికీ బుల్లితెరపై టాప్ షోగా చెలామని అవుతోంది. ఇక తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి.

Bigg Boss 10: బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ.. ఆ సీరియల్ నటి ఈసారి హౌస్‌లో సందడి చేయనుందా.?
Bigg Boss 10
Rajeev Rayala
|

Updated on: Jun 09, 2026 | 6:54 AM

Share

బిగ్ బాస్ సీజన్ 10 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా9 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో సీజన్ 10తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఇటీవలే బిగ్ బాస్ 10 ప్రోమోను విడుదల చేశారు. ఈ సారి సీజన్ కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ గేమ్ షోకు మంచి క్రేజ్ ఉంది. ప్రతి సీజన్ సరికొత్త గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్వాహకులు. సెలబ్రెటీలతో పాటు సామాన్యులు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక పోతే బిగ్ బాస్ సీజన్ 1కి జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కి నాని హోస్ట్‌గా వ్యవహరించారు. సీజన్ 3 నుంచి సీజన్ 9 వరకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కు భిన్నంగా ఈ సీజన్ 10 ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో బీబీ సీజన్ 10పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటోంది. సీజన్ 10లో కొత్త నిబంధనలు, కొత్త గేమ్స్‌తో మరింత ఆసక్తికరంగా.. వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసినట్టు స్టార్ మా వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటివరకు అన్ని సీజన్లు టీఆర్పీ దుమ్మురేపాయి. అలాగే సీజన్ 9 కూడా మంచి టీఆర్పీ దక్కించుకుంది. ఇక సీజన్ 10 అంతకు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక సీజన్ 10 మొదలవ్వగానే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది వీరే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం అంటూ సరికొత్తగా రాబోతున్న సీజన్ లో ఓ సీరియల్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. జబర్దస్త్ నుంచి ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, నందూస్ వరల్డ్ నందూ, పండు మాస్టర్, ఆట సందీప్ సతీమణి జ్యోతి, రాయల్ మెక్ రమణ, తేజస్విని గౌడ, శివ్ కుమార్, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, రైటర్ కడలి సత్యనారాయణ, అలాగే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే సీరియల్ బ్యూటీ పల్లవి గౌడ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. సీరియల్స్ ద్వారా పల్లవి గౌడ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. చూడముచ్చటగా ఉండే ఈ అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా ఎక్కువే.. మరి ఈ చిన్నది బి ఈజ్ బాస్ లోకి అడుగుపెట్టడం ఖాయం అంటున్నారు కొందరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
ఇంట్లో పిల్లిని పెంచుకుంటే అదృష్టమా? దురదృష్టమా? వాస్తు శాస్త్రం
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
కోట్ల విలువైన వాచీలు, చెయిన్లు.. ఫ్యాషన్ క్రికెటర్‌‌
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..
లక్ష్మీ కటాక్షం.. పాపాలు తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించే రమా..