మహేష్ గారాలపట్టి ఏ మేరకు మెప్పిస్తుందో..?

సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. కావాల్సిన క్రేజ్‌ను సంపాదించుకుంది సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయ సితార. ఫ్యాన్స్ అందరూ సితార పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఇక సితార చేసే చిలిపి, అల్లరి పనులకు సంబంధించిన వీడియోలను మహేష్ బాబు కూడా తరచుగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. కాగా సితారను సినిమాల్లోకి తీసుకురావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారందరి కోరిక మేరకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది సితార. అయితే సినిమాలో చైల్డ్ […]

  • Updated On - 10:29 am, Tue, 12 November 19 Edited By:
మహేష్ గారాలపట్టి ఏ మేరకు మెప్పిస్తుందో..?

సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకపోయినా.. కావాల్సిన క్రేజ్‌ను సంపాదించుకుంది సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయ సితార. ఫ్యాన్స్ అందరూ సితార పాప అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఇక సితార చేసే చిలిపి, అల్లరి పనులకు సంబంధించిన వీడియోలను మహేష్ బాబు కూడా తరచుగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. కాగా సితారను సినిమాల్లోకి తీసుకురావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. వారందరి కోరిక మేరకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది సితార. అయితే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కాకుండా, మొదటగా ఓ కారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పేందుకు సిద్ధమైంది సితార పాప.

ప్రముఖ డిస్నీ సంస్థ ‘ఫ్రోజెన్ 2’ అనే చిత్రాన్ని యానిమేటెడ్ నిర్మించిన విషయం తెలిసిందే. ‘ఫ్రోజెన్’ సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని భారతదేశంలోని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక తెలుగులో కూడా ఈ సినిమా రానుండగా.. అందులో ఎల్సా చిన్నప్పటి కారెక్టర్‌కు సితార డబ్బింగ్ చెప్పబోతోంది. ఈ విషయాన్ని డిస్నీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

అయితే ఇక్కడే పుట్టి పెరిగినప్పటికీ.. సితార ఇంతవరకు తెలుగు ఎప్పుడూ మాట్లాడలేదు. ఏదో పాటలు పాడటం తప్ప.. ఎక్కడా ఆమె తెలుగు మాట్లాడిన వీడియోలు లేవు. ఇక దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆధ్యతో కలిసి ఏ అండ్ ఎస్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. రెండు, మూడు వీడియోలను రిలీజ్ చేసినప్పటికీ.. అందులోనూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడింది సితార. మరి ఇప్పుడు మొదటిసారిగా ఆమె ఓ డబ్బింగ్ సినిమాకు తెలుగులో డైలాగ్‌లు చెప్పబోతుండగా.. ఆమె పలుకులను వినేందుకు ఫ్యాన్స్ కూడా సిద్దంగా ఉన్నారు. మరి వారందరిని సితార ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే నవంబర్ 22 వరకు వేచి ఉండాల్సిందే.