నారా వారి అబ్బాయి సినిమాలకేమైంది..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి మొదటి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. 2009లో ‘బాణం’ సినిమా ద్వారా వచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 18 చిత్రాల్లో నటించాడు(సారొచ్చారులో అతిథి పాత్ర కలుపుకొని). అయితే వీటిలో ఏడెనిమిది చిత్రాలు మినహాయించి.. మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా మిగిలాయి. ఈ మధ్యలోనే అరన్ మీడియా వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి.. నాలుగు చిత్రాలను కూడా నిర్మించాడు. అంతేకాదు మొదటి నుంచి వైవిధ్య కథలనే […]

నారా వారి అబ్బాయి సినిమాలకేమైంది..?
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 12:24 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి మొదటి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు నారా రోహిత్. 2009లో ‘బాణం’ సినిమా ద్వారా వచ్చిన రోహిత్.. ఇప్పటివరకు 18 చిత్రాల్లో నటించాడు(సారొచ్చారులో అతిథి పాత్ర కలుపుకొని). అయితే వీటిలో ఏడెనిమిది చిత్రాలు మినహాయించి.. మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా మిగిలాయి. ఈ మధ్యలోనే అరన్ మీడియా వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి.. నాలుగు చిత్రాలను కూడా నిర్మించాడు. అంతేకాదు మొదటి నుంచి వైవిధ్య కథలనే ఎంచుకుంటూ వచ్చిన నారా రోహిత్.. పలువురు దర్శకులను కూడా టాలీవుడ్‌కు పరిచయం చేశాడు.

ఇదంతా పక్కనపెడితే అంతకుముందు సంవత్సరానికి కనీసం రెండు సినిమాలతోనైనా పలకరించే రోహిత్.. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. చివరి సారిగా గతేడాది ‘వీర భోగ వసంత రాయలు’ అనే చిత్రంలో కనిపించాడు ఈ హీరో. ‘అనగనగా దక్షిణాదిలో’, ‘శబ్ధం’, ‘పండగలా వచ్చాడు’ అనే చిత్రాల్లో నటించినప్పటికీ.. ఇందులో ఈ సంవత్సరం ఒక్కటి కూడా విడుదలకు నోచుకోలేదు. ఇక ఇటీవల తన స్నేహితుడు శ్రీవిష్ణు తిప్పరా మీసం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వచ్చినా.. తన సినిమాల గురించి మాత్రం ఏం మాట్లాడలేదు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో నారా రోహిత్.. టాలీవుడ్‌కు బై బై చెప్పాడన్న వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను అతడి సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. త్వరలో రోహిత్.. ఓ పీరియాడిక్ డ్రామాలో కనిపించనున్నాడని వారు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత..? నారా రోహిత్ తదుపరి చిత్రం ఏంటి..? అనే వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..