గోవాలో సందడి చేస్తున్న బాలీవుడ్ ప్రేమజంట.. చాలాకాలం తర్వాత ప్రేక్షకుల కంటపడిన ప్రేమ పావురాలు..

బాలీవుడ్ ప్రేమ పావురాలు అప్పుడప్పుడు ప్రేక్షకుల కంటపడుతూ సందడి చేస్తూ ఉంటాయి. తాజాగా

  • uppula Raju
  • Publish Date - 11:51 pm, Tue, 15 December 20
గోవాలో సందడి చేస్తున్న బాలీవుడ్ ప్రేమజంట.. చాలాకాలం తర్వాత ప్రేక్షకుల కంటపడిన ప్రేమ పావురాలు..

బాలీవుడ్ ప్రేమ పావురాలు అప్పుడప్పుడు ప్రేక్షకుల కంటపడుతూ సందడి చేస్తూ ఉంటాయి. తాజాగా రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ గోవాకు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజా పెళ్లి వేడుకల్లో కనిపించిన ఈ జంట చాలాకాలం తర్వాత మళ్లీ ఇప్పడు సందడి చేస్తూ కనిపించింది. వీరిద్దరు చాలాకాలం నుంచి ప్రేమించుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే.

ఉన్నట్టుండి వీరిద్దరు ఒక్కసారిగా గోవాకు వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాఫిక్‌గా మారింది. అయితే దీనికి ఓ కారణం ఉంది. కేవలం పుట్‌బాల్ మ్యాచ్‌ చూడటానికి మాత్రమే వెళ్లారని తెలిసింది. ఎందుకంటే ఇండియన్ సూపర్ లీగ్ పుట్‌బాల్‌లో ముంబై జట్టుకు రణ్‌బీర్ కపూర్ సహయజమానిగా వ్యవహరిస్తున్నాడు. అయితే గోవాలో జంషెడ్‌పూర్ జట్టుతో ముంబై సిటీ జట్టుకు పుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. దీనిని చూడటానికి అక్కడికి వెళ్లారని తెలిసింది. అయితే వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను ముంబై సిటీ జట్టు తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తాజాగ వీరిద్దరు కలిసి బ్రహ్మస్త్ర సినిమలో నటిస్తున్నారు.