Bangarraju: బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేశాడు.. రాజ‌మండ్రిలో స‌క్సెస్ ఈవెంట్‌.. లైవ్ వీడియో..

Bangarraju: క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను సైతం త‌ట్టుకొని బంగార్రాజు విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. క‌రోనా నేప‌థ్యంలో భారీ చిత్రాల‌న్నీ వాయిదా వేసుకున్నా ధైర్యంతో ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని అందుకున్నారు నాగార్జున‌. అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా..

Bangarraju: బంగార్రాజు బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేశాడు.. రాజ‌మండ్రిలో స‌క్సెస్ ఈవెంట్‌.. లైవ్ వీడియో..
Follow us

|

Updated on: Jan 18, 2022 | 6:31 PM

Bangarraju: క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను సైతం త‌ట్టుకొని బంగార్రాజు విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. క‌రోనా నేప‌థ్యంలో భారీ చిత్రాల‌న్నీ వాయిదా వేసుకున్నా ధైర్యంతో ముందుకు వ‌చ్చి మంచి విజ‌యాన్ని అందుకున్నారు నాగార్జున‌. అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను థియేట‌ర్స్‌కు క్యూ క‌ట్టేలా చేసిందీ సినిమా. కేవ‌లం మూడు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్ల‌బ్‌లో చేరిందీ సినిమా. మూడు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 24 కోట్ల షేర్ వ‌సూలు చేసిన ఈ సినిమా, ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 27 కోట్లు కొల్ల‌గొట్టింది.

ఇదిలా ఉంటే బంగార్రాజుకు ఇప్ప‌ట్లో మ‌రో సినిమా పోటీ లేక‌పోవ‌డం, సంక్రాంతి సెల‌వులు పొడిగించ‌డంతో క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని సినిమా వ‌ర్గాలు చెబుతున్నాయి. సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ స‌క్సెస్ కావ‌డంతో చిత్ర యూనిట్ బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ మీట్‌ను ఏర్పాటు చేసింది. రాజ‌మండ్రిలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్‌లో ఈ కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. బంగార్రాజు బ్లాక్‌బ‌స్ట‌ర్ మీట్ ప్ర‌త్య‌క్ష కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డ చూడండి..

Also Read: Ministers Warangal tour: పంట నష్టపోయిన ప్రతీ రైతునూ ఆదుకుంటాం.. భరోసా ఇచ్చిన మంత్రులు

Anasuya Bharadwaj : నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన అనసూయ.. ఇంతకు అతడు ఏమడిగాడంటే..