Vijay ‘Master’ : బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న విజయ్ ‘మాస్టర్’… వారంరోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

దళపతి విజయ్ మాస్టర్  గా ఈ సంక్రాంతికి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. తెలుగులోనూ విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. విజయ్ సినిమాలన్నీ..

Vijay 'Master' : బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న విజయ్ 'మాస్టర్'...  వారంరోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 5:34 AM

Vijay ‘Master’ :  దళపతి విజయ్ మాస్టర్  గా ఈ సంక్రాంతికి సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. తెలుగులోనూ విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. విజయ్ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాలను అందుకుంటున్నాయి. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాపై ముందు నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. వసూళ్ల పరంగా మాస్టర్ సినిమా  బాక్సాఫీస్ దగ్గర కూడా దూసుకుపోతుంది. ఇప్పటికీ తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి.   కరోనా వైరస్ తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న భయం పోగొట్టి థియేటర్ ల వరకు వాళ్లను రప్పించడంలో మాస్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సంక్రాంతికి క్రాక్, రెడ్ లాంటి సినిమాలు గట్టిపోటీని ఇచ్చినా కూడా వారం రోజుల్లోనే దాదాపు 13 కోట్ల షేర్ వసూలు చేసింది మాస్టర్. ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మాస్టర్..ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వారం రోజుల్లో 12.82 కోట్ల షేర్ తీసుకొచ్చింది. నైజాం – 3.12 కోట్లు, సీడెడ్ – 2.49 కోట్లు, ఉత్తరాంధ్ర – 2.19 కోట్లు, ఈస్ట్ – 1.04 కోట్లు, వెస్ట్ – 1.19 కోట్లు, కృష్ణా – 1.01 కోట్లు, గుంటూరు – 1.20 కోట్లు, నెల్లూరు – 59 లక్షలు వాసులు చేసింది మాస్టర్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hero Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ కామిక్ బుక్.. నెట్టింట్లో వైరల్‏గా మారిన పోస్టర్..