వివాదంలో ‘వాల్మీకి’ టైటిల్?

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమా ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. అయితే ఈ చిత్ర టైటిల్ మార్చాలంటూ చాలా రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చినా కూడా బోయ సంఘం మాత్రం ఊరుకోవడం లేదు. వ‌రుణ్‌ తేజ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వస్తున్న వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ మంచివాడుగా ఎలా మారాడు..ఎందుకు […]

వివాదంలో 'వాల్మీకి' టైటిల్?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2019 | 6:39 PM

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమా ఈనెల 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. అయితే ఈ చిత్ర టైటిల్ మార్చాలంటూ చాలా రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. దీనిపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చినా కూడా బోయ సంఘం మాత్రం ఊరుకోవడం లేదు. వ‌రుణ్‌ తేజ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్ నుంచి వస్తున్న వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. ఓ గ్యాంగ్‌స్ట‌ర్ మంచివాడుగా ఎలా మారాడు..ఎందుకు మారాల్సి వచ్చింది.. అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా వస్తుంది. బోయవాడు వాల్మీకిగా మారి రామాయణం రాసాడు కాబట్టి.. తన సినిమా కూడా అలాగే ఉంటుందని తన సినిమాకు వాల్మీకి టైటిల్ పెట్టానని చెప్పాడు హరీష్ శంకర్. అయితే ఈ టైటిల్ విషయంలో ముందు నుంచి బోయ సామాజిక వ‌ర్గం నుంచి అభ్యంత‌రాలు వస్తూనే ఉన్నాయి. రామాయ‌ణాన్ని రాసిన వాల్మీకి పేరుని ఓ గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు ఎలా పెడ‌తారు.. అసలు ఆయన్ని ఓ గ్యాంగ్ స్టర్‌తో ఎలా పోలుస్తారంటూ వాళ్లు మండిపడుతున్నారు.

కచ్చితంగా ఈ టైటిల్‌ను మార్చాల్సిందే అంటూ వాళ్లు ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేశారు. ఇక ఇప్పుడు ఇష్యూలోకి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మణ్‌ కూడా వచ్చారు. ఈయన్ని కొందరు బోయ సామాజిక వ‌ర్గానికి చెందిన నేతలు క‌లిశారు. ల‌క్ష్మ‌ణ్‌ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు గ్యాంగ్‌స్ట‌ర్ సినిమాకు `వాల్మీకి` టైటిల్ అని పెట్టడమే తప్పు.. దానివల్ల బోయ వాల్మీకి సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు.

ఇప్పటికే ఈ ఇష్యూపై సెన్సార్ బోర్డుకి ఫిర్యాదు చేశామని.. త‌క్ష‌ణ‌మే సినిమా టైటిల్‌ను మార్చాల‌ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పాడు లక్ష్మణ్. లేక‌పోతే బోయ‌లంతా ఏక‌మ‌వుతారని ఆయన హెచ్చరిస్తున్నాడు. త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు, న‌టులే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుందని చెప్పాడు ఈయన. చూడాలి మరి ఎం జరుగుతుందో.

ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..