VarunDhawan : ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ హీరో.. పెళ్ళికి హాజరు కానున్న బాలీవుడ్ స్టార్స్
సినిమా ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా పెళ్లిబాజాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ తారలు పెళ్లిపీటలు ఎక్కినా విషయం తెలిసిందే.. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో..
VarunDhawan : సినిమా ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా పెళ్లిబాజాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ తారలు పెళ్లిపీటలు ఎక్కినా విషయం తెలిసిందే.. ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వరుణ్ ధావన్ తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్‌ను ఈ నెల 24న పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
జనవరి 22న అలీబాగ్ లో వెడ్డింగ్ పనులు మొదలుపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు బీటౌన్ వర్గాల టాక్. సన్ సెట్ వెడ్డింగ్ అని పిలిచే వరుణ్ నటాషాల పెళ్లికి బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ లతో పాటు కరణ్‌జోహార్, శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులు, డైరెక్టర్ రెమో డిసౌజా, శశాంక్ కైతాన్ హాజరవనున్నారని తెలుస్తోంది. ఇక జనవరి 26న ఈ నూతన దంపతులు తమ స్నేహితులు సన్నిహితుల కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారట. మొత్తానికి బాలీవుడ్ లో ఓ కుర్రహీరో ఇంటివాడైపోతున్నాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :