నేను తన్ని తరిమేయలేదు.. అతడే వెళ్లిపోయాడు: వనితా విజయ్‌ కుమార్‌

నటి వనితా విజయ్ కుమార్ మూడో వైవాహిక జీవితం కూడా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యానికి బానిసైన వనితా మూడో భర్త పీటర్‌ని ఇంట్లో నుంచి గెంటేసిందని ఇటీవల గాసిప్‌లు వినిపించాయి

నేను తన్ని తరిమేయలేదు.. అతడే వెళ్లిపోయాడు: వనితా విజయ్‌ కుమార్‌
Follow us

| Edited By:

Updated on: Oct 21, 2020 | 5:16 PM

Vanitha Vijaykumar News: నటి వనితా విజయ్ కుమార్ మూడో వైవాహిక జీవితం కూడా ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. మద్యానికి బానిసైన వనితా మూడో భర్త పీటర్‌ని ఇంట్లో నుంచి గెంటేసిందని ఇటీవల గాసిప్‌లు వినిపించాయి. దాంతో ఆమె ఓ ప్రకటనను విడుదల చేసింది. ”ప్రేమలో విఫలం కావడం అలవాటై పోయింది. కానీ వీటిని ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉన్నా. ప్రేమని నమ్ముతూ మోసపోవడం చాలా బాధగా, నొప్పిగా ఉందని.. ఆ విషయం ఎవ్వరికీ తెలీదని పేర్కొంది. జీవితం ఒక పాఠం. ఇంకా తాను నేర్చుకుంటున్నానని వెల్లడించింది. ఫేక్ వార్తలను నమ్మొద్దని, తాను ఏ తప్పు చేయలేదని, నా కలలు, జీవిత ఆశలు చెదిరిపోయే స్థితిలో ఉన్నాయని, ఎంతో పాజిటివ్‌గా ఉన్నా, భయంగా ఉందని” తన బాధను వ్యక్తం చేసింది. ఇక తాజాగా మరో వీడియోను విడుదల చేసింది.

”అతడిపై నేను చాలా కేర్ తీసుకున్నా. మా జీవితం సాఫీగా నడుస్తున్నా పీటర్ మళ్లీ మద్యానికి బానిసయ్యాడు. నేను ఓ కుటుంబాన్ని విడదీయలేదు. పీటర్‌కి ఓ కుటుంబాన్ని ఇద్దామనుకున్నా. నాకు, నా పిల్లలకు మద్దతుగా ఉండేలా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని చేసుకున్నా. మద్యం వలన పీటర్‌కి హార్ట్‌ అటాక్ వచ్చింది. అతడిని ఆసుపత్రికి తీసుకున్నా. చాలా డబ్బులే ఖర్చు చేశా. ఇంటికి తీసుకువచ్చిన తరువాత పీటర్‌ ఏ మాత్రం మారలేదు. స్మోకింగ్‌, డ్రింకింగ్ చేసేవాడు. ఒకసారి రక్తవాంతులు కావడంతో మళ్లీ ఆసుపత్రికి తరలించాము. ఐసీయూలో ఒక వారం ఉండి తరువాత ఇంటికి తీసుకొచ్చాము.

పీటర్‌ తరచుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లేవాడు. మద్యం కోసం పలువురిని డబ్బులు అడిగేవాడు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నాకు ఫోన్ చేసి, నీ జీవితంలో ఏం జరుగుతోంది. అతడిని కాస్త మార్చు అని చెప్పారు. అతడి ఫోన్‌లో ట్రాకర్‌ కూడా పెట్టా. కానీ పరిస్థితి ఏం మారలేదు. అతడు ఆల్కాహాల్‌ని సేవించి బతికేవాడు. ఒక వారం రోజులు ఏం తినకుండా కేవలం మద్యం తాగి జీవించాడు. ఒకరోజు ఉదయం 4 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతడి అసిస్టెంట్‌ ఇంటికి తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో కామెంట్లు, ఆరోపణలతో అతడు అలా అవుతున్నాడేమోనని భావించి, గోవా ట్రిప్‌కి వెళ్లాము. అక్కడి నుంచి హ్యాపీగా ఇంటికి వచ్చాము.

అయితే ఇంటికి వచ్చాక అతడి సోదరుడు చనిపోయినట్లు ఫోన్ వచ్చింది. దీంతో తాను ఇంటికి పోతానని అన్నాడు. అప్పుడు అతడికి డబ్బులు కూడా ఇచ్చి పంపాను. కానీ చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు ఇంటికి రాలేదు. అతడు ఇంతవరకు నాకు ఫోన్ చేయలేదు. నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు. ప్రస్తుతం అతడు తన కుటుంబంతో ఉన్నాడు. అతడి మొదటి భార్య, పిల్లల దగ్గరే అతడు ఉండాలనుకున్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పీటర్ గురించి అతడి భార్య చెప్పింది నిజమే. నేను ఎంత బాగా చూసుకున్నానో అతడికి తెలుసు. కానీ అతడికి నాకంటే మద్యం ఎక్కువ అని అర్థమవుతోంది. నాకంటే ఎక్కువ పీటర్ మద్యాన్ని ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. కానీ వీటన్నింటిని ఎదుర్కొంటానని ఆశిస్తున్నా” అని వీడియోలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.

అయితే వనితా, పీటర్‌ని వివాహం చేసుకునే సమయంలోనూ చాలా మంది ఆమెను హెచ్చరించారు. అతడు అన్నీ అబద్దాలు చెప్తాడని, మద్యానికి బానిస అని అన్నారు. కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా వనితా, పీటర్‌ని జూన్‌లో పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమెపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయితే వాటిని ఆమె ఖండించింది. తన జీవితం బావుందంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు వనితాపై నెట్టింట విమర్శలు ఎక్కువవుతున్నాయి.

Read More:

ఏడాదికి పైగా ఫ్రిజ్‌లో న్యూడిల్స్‌.. తిని తొమ్మిది మంది మృతి

అనిల్ రావిపూడికి ‘ఇండియన్ పనోరమ’ అవార్డు