లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: పవన్ మూవీ వచ్చేది అప్పుడేనా..!

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: పవన్ మూవీ వచ్చేది అప్పుడేనా..!

దాదాపు రెండేళ్ల తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్‌..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 08, 2020 | 3:04 PM

దాదాపు రెండేళ్ల తరువాత వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. వరుసగా మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్‌.. వాటిలో ఓ మూవీతో ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు. అన్నీ కుదిరి ఉంటే ఈ నెలలోనే పవన్‌ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’‌ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ అనుకోకుండా కరోనా రావడం, లాక్‌డౌన్ ప్రకటించడంతో.. మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఇక జూన్‌ నుంచి షూటింగ్‌లు చేసుకోవచ్చు అంటూ తెలంగాణలో అనుమతి లభించినప్పటికీ.. ఈ మూవీలో పాల్గొనాల్సిన మిగిలిన వారు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.

ఇది పక్కనపెడితే ఈ మూవీకి సంబంధించి షూటింగ్ కొద్ది శాతం మాత్రమే మిగిలి ఉంది. ఆ చిత్రీకరణను పూర్తి చేసుకొని దసరాకు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు అనుకున్నారట. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ ఏడాది దసరా సెలవులు ఎక్కువగా ఉండకపోవచ్చు. అప్పుడు క్యాష్ చేసుకోవడం కూడా కష్టం. అందుకే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్ర విడుదలను వాయిదా వేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘పింక్’‌ రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతోంది. ‘ఎమ్‌సీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, నివేథా థామస్‌, అనన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. బోని కపూర్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

Read This Story Also: చిరు హిట్ మూవీ సీక్వెల్‌ తీసిన తరువాతే రిటైర్మెంట్ తీసుకుంటా..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu