Kiran Abbavaram: హీరోలు ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ కుర్రహీరోలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం బిజీ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాడు ఈ యంగ్ హీరో.

Kiran Abbavaram: హీరోలు ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram
Follow us

|

Updated on: Jun 21, 2022 | 9:58 AM

టాలీవుడ్ కుర్రహీరోలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)ఒకరు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం బిజీ హీరోల్లో ఒకరిగా మారిపోయాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చాడు ఈ యంగ్ హీరో. కిరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.. సమ్మతమే.  చిత్రంలో మరో విభిన్నమైన పాత్రలో అలరించనున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా సందడి చేస్తుంది.ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ క్యూరియాసిటీని పెంచుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు కిరణ్.

కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. హీరోలు ఎక్కువ సినిమాలు చేయడమే కరెక్ట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కిరణ్. వరుసగా సినిమాలు బయటికి వస్తుంటే అందరికీ పని దొరుకుతుంది. అయితే ఒక సినిమాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. నేను వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నప్పటికీ వాటికి కేటాయించే సమయం ఎక్కువ. ప్రతి సినిమా పై చాలా కేర్ తీసుకుంటాను. నా దర్శకులు, నిర్మాతలు బలంగా వుండటం నా అదృష్టం. అనుకున్న సీన్ సరిగ్గా రాకపోతే మళ్ళీ షూట్ చేయడానికి నిర్మాతలు సిద్దంగా వున్నారు. ఇప్పుడు రాబోతున్న నాలుగు సినిమాలు చాలా పెద్ద స్కేల్ లో చేశాం. మంచి సినిమాలు చేశాం. మీ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అన్నారు.

ఒక అమ్మాయి తాలూకు ఎమోషన్స్ అన్నీ ఈ సినిమాలో వుంటాయి. ప్రేమలో పడినపుడు, ఒక రిలేషన్ షిప్ లో వున్నపుడు ఇలా ప్రతి ఎమోషన్ ని కొత్తగా ప్రజంట్ చేశాం. అలాగే ఒక మధ్యతరగతి తండ్రి కొడుకు, తల్లి, కొడుకు మధ్య అనుబంధం చాలా ఎమోషనల్ గా వుంటుంది. ముఖ్యంగా సమ్మతమే క్లైమాక్స్ అద్భుతంగా వుంటుంది. క్లైమాక్స్ లో చెప్పే పాయింట్ కి అందరూ కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం. నాకు ఇలాంటి కథలు నచ్చుతున్నాయేమో. నేను దర్శక నిర్మాతలకు అలా కనిపిస్తున్నానేమో. నాపై ఇలాంటి కథలు చేస్తే వర్క్ అవుట్ అవుతాయని అనుకోవచ్చు. నేను కథ ఎంపిక చేసినప్పుడు అవుట్ ఆఫ్ ది బాక్స్ పాయింట్లకి మొగ్గు చూపను. నాకు మన మధ్య జరిగే కథలే ఇష్టం. ఇది మనోడి కథరా అనే ఫీలింగ్ వునప్పుడే నేను ఎక్కువ ఎక్సయిట్ అవుతాను. ఇలాంటి కథలే ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడతాను. సమ్మతమే ఇలాంటి టైటిల్స్ వినగా వినగా వాల్ పోస్టర్ పై చూడగా చూడగా ఎక్కువగా రీచ్ వుంటుంది. ఉదాహరణకి గీత గోవిందం. సమ్మతమే ఫార్మేట్ కూడా ఇలానే వుంటుంది. బొమ్మరిల్లు లాంటి సినిమాని చూసినపుడు ఎంటర్టైన్మెంట్, లవ్ ని ఫీలౌతూ ఒక మంచి ఫీలింగ్ తో బయటికివస్తాం కదా.,. అలాంటి వైబ్ లోనే సమ్మతమే వుంటుంది. సమ్మతమే టైటిల్ విన్నప్పుడే చాలా ఎక్సయిట్ ఫీలయ్యాం. పోస్టర్ లో కూడా టైటిల్ వైబ్రేటింగా వుంది అంటూ చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి