Kartikeya: ఇక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అక్కడ అజిత్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన యంగ్ హీరో కార్తికేయ

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వలిమై.. జీ స్టూడియోస్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్  వ‌లిమై ను నిర్మిస్తున్నారు.

Kartikeya: ఇక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అక్కడ అజిత్.. ఆసక్తికర కామెంట్స్ చేసిన యంగ్ హీరో కార్తికేయ
Karthikeya
Follow us

|

Updated on: Feb 23, 2022 | 4:38 PM

Kartikeya: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వలిమై.. జీ స్టూడియోస్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో బోనీ క‌పూర్ వ‌లిమైను నిర్మిస్తున్నారు. ఐవీవై ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా వ‌లిమై చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు గోపీచంద్ ఇనుమూరి అందిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 24న ‘వ‌లిమై’ గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ మాట్లాడుతూ.. 2017లో నా ఆర్.ఎక్స్ 100 రిలీజ్ కాలేదు. నేను, నా ఫ్రెండ్ కలిసి ఖాకి సినిమా చూశాం. అప్పుడు ‘ఈ డైరెక్టర్ నాతో సినిమా చేస్తానంటే స్క్రిప్ట్ వినకుండానే ఒప్పుకుంటాను’ అని నా ఫ్రెండ్‌తో చెప్పాను. నిజంగా నేను అదృష్ట‌వంతుడ్ని. మూడేళ్ల త‌ర్వాత అదే డైరెక్ట‌ర్‌తో నాకు ప‌ని చేసే ఛాన్స్ వ‌చ్చింది అన్నారు. వినోద్‌గారు చాలా కంఫ‌ర్ట్ ఇచ్చి నాతో వ‌ర్క్ చేయించుకున్నారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో అజిత్ సార్‌తో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. ఆయ‌నలో ఒక శాతం కూడా స్వార్థం ఉండ‌దు. ఆయ‌న జెన్యూన్ ప‌ర్స‌న్‌. నాకు ఈ సినిమా ప్ల‌స్ కావాలని బ‌లంగా కోరుకున్నారు. నా క్యారెక్ట‌ర్‌ను ఇంకా గొప్ప‌గా చూపించాల‌ని ఆయ‌నే జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. న‌న్ను ప్ర‌మోట్ చేశారు అని తెలిపారు కార్తికేయ.

అంత గొప్ప హీరోతో రిలేష‌న్ ద‌క్క‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్ర‌వ‌రి 24న మీ అంద‌రిక‌న్నా సినిమా కోసం నేనే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. బోనీ క‌పూర్‌గారు.. మన అల్లుడు. రెండేళ్ల పాటు అనేక స‌మ‌స్య‌ల‌ను దాటి వ‌లిమై సినిమా చేశాం. ప్ర‌తి స‌మ‌స్య‌ను దాటించ‌డంలో మ‌మ్మ‌ల్ని ముందుండి న‌డిపించారు బోనిగారు. ఆయ‌న ఎంత గొప్ప నిర్మాతో ఆయ‌న‌తో ప‌నిచేసిన త‌ర్వాత అర్థ‌మైంది. మేమేంతో ఇష్ట‌ప‌డే శ్రీదేవిగారి బ్యాన‌ర్‌లో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. ఆయ‌న‌తో క‌లిసి మ‌ళ్లీ ప‌నిచేయాల‌ని అనుకుంటున్నాను. హ్యూమా ఖురేషి అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించారు. సినిమాల‌తో, పెర్పామెన్స్‌ల‌తో సంబంధం లేని హీరోలు ఇక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారైతే, త‌మిళ‌నాడులో అజిత్ గారు. ఇద్ద‌రి సినిమాలు ఒకేసారి వస్తున్నాయి. క‌చ్చితంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూమెంట్‌. 24న వ‌లిమై చూడండి. 25న భీమ్లా నాయ‌క్ చూడండి’’  అని చెప్పుకొచ్చాడు కార్తికేయ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Deverakonda : న్యూ లుక్ తో కేక పుట్టిస్తోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ

Sehari Aha: ఆహాలో యూత్‎ఫుల్ లవ్ స్టోరీ.. “సెహరి” మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Santosh Shoban : సైలెంట్‌గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్న కుర్ర హీరో.. సంతోష్ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనే..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!