Sehari : ఖిలాడి మూవీకి పోటీ పడుతున్న కుర్ర హీరో సినిమా.. ఫిబ్ర‌వ‌రి 11న సెహరి కూడా..

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సెహరి. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని జ్ఞానసాగర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు..

Sehari : ఖిలాడి మూవీకి పోటీ పడుతున్న కుర్ర హీరో సినిమా.. ఫిబ్ర‌వ‌రి 11న సెహరి కూడా..
Sehari
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 01, 2022 | 9:17 AM

Sehari : హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సెహరి. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీని జ్ఞానసాగర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. హీరో హర్ష్‌ అదిరిపోయే స్టెప్పులతో ‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ యూత్‌ఫుల్‌ ట్రాక్‌గా నిలువ‌గా..సెకండ్‌ సాంగ్‌ ‘ఇది చాలా బాగుందిలే’ పాట‌లో హర్ష్‌ తన అద్భుతమైన డ్యాన్స్‌ మూమెంట్స్‌తో, తన అందమైన లుక్స్‌తో సిమ్రాన్ చౌద‌రి వెండితెరపై అదుర్స్‌ అనిపించారు. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

హ‌ర్ష్ క‌నుమిల్లి ఈ చిత్రానికి క‌థా ర‌చ‌యితగా వ్య‌వ‌హ‌రించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. విడుద‌ల తేది ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌డంతో వివిధ ర‌కాల ప్ర‌మోష‌న్స్ ను ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్‌. ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమా కూడా ఫిబ్రవరి11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖిలాడి సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న  ఈసినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు పోటీగా ఇప్పుడు ఏ యంగ్ హీరో సినిమా రానుంది. మరి ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను అలా ఆకట్టుకుంటాయో చూడాలి. సెహరి సినిమాకు ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తుండ‌గా అరవింద్‌ విశ్వనాథ్ సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Mahesh Babu: మహేష్‌ కూడా రిలీజ్‌ డేట్‌ ప్రకటించేశాడోచ్‌.. సర్కారు వారి పాట ఎప్పుడు రానుందంటే..

Tollywood: టాలీవుడ్‌లో జోష్‌ పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన.. వరుసగా సినిమాల తేదీలపై అప్‌డేట్స్‌..

Nikki Galrani: రీఎంట్రీ కి సై అంటున్న బుజ్జిగాడు ముద్దుగుమ్మ..? ‘నిక్కీ గల్రానీ’ న్యూ ఫొటోస్..

మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో
ట్రెండ్ మారింది.. అంతటా క్రెడిట్ కార్డు మహిమే.. రికార్డు స్థాయిలో