Chiranjeevi: మెగాస్టార్ మూవీలో ఆ ఇద్దరు హీరోలు కూడా కనిపించనున్నారా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమాకోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Chiranjeevi: మెగాస్టార్ మూవీలో ఆ ఇద్దరు హీరోలు కూడా కనిపించనున్నారా..?
Megastar Chiranjeevi 154
Rajeev Rayala

|

Sep 25, 2022 | 5:47 PM

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)సినిమాకోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య సినిమా నిరాశపరచడంతో ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైనప్ చేశారు మెగాస్టార్. ప్రస్తుతం గాడ్ఫాదర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు చిరు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మలయాళ రీమేక్ లూసిఫర్ సినిమాకు రీమేక్. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు చిరు. ఈ సినిమా తమిళ్ మూవీ వేదాళమ్ సినిమాకు రీమేక్ గా రానుంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ ఆ నటిస్తుండగా కీర్తిసురేష్ మెగాస్టార్ సిస్టర్ గా నటించనుంది.

ఇక వీటితర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ మాస్ మాసాల సినిమాలో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య అనే టైటిల్ తో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో చిరు ఊర మాస్ పాత్రలో నటించనున్నారు. అలాగే ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలో రవితేజ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాగురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేయనున్నారట. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు. వెంకటేష్, నాగార్జున. మెగాస్టార్ 154 సినిమాగా వస్తోన్న ఇందులో వెంకటేష్, నాగార్జున ఇద్దరు గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu