Pawan Kalyan: జూలు విదిల్చిన సింహంలా.. పంజా విసరుతున్న పులిలా.. మెరుపు వేగంతో సినిమాలు.. రీజన్..?

పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ఎందుకిలా వరస సినిమాలు చేస్తున్నారు..? మొన్నటి వరకు ఒక్క సినిమా చేయడమే గగనం అనుకున్న నిర్మాతలకు.. ఒకేసారి ఇలా వరాల జల్లు కురిపించడం వెనక మతలబేంటి..? కేవలం డబ్బుల కోసమే వరసగా ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటున్నారా..? రాజకీయ భవిష్యత్తులో భాగంగానే.. సినిమాలపై ఫోకస్ పెంచేసారా..? పవన్ జోరు వెనక అసలు కారణమేంటి..?

Pawan Kalyan: జూలు విదిల్చిన సింహంలా.. పంజా విసరుతున్న పులిలా.. మెరుపు వేగంతో సినిమాలు.. రీజన్..?
Actor Pawan Kalyan
Follow us

|

Updated on: Dec 07, 2022 | 8:15 PM

పవన్ కళ్యాణ్ వరస సినిమాలు చేస్తున్నారంటే అభిమానులే నమ్మట్లేదు.. ఇక నిర్మాతలేం నమ్ముతారు. ఎప్పట్నుంచో ఆయన కోసం వేచి చూస్తున్న దర్శకులకు ఓ దశలో విసుగొచ్చి మరో హీరోను చూసుకుందాం అనుకున్నారు. కానీ అక్కడున్నది పవన్.. ఎప్పుడెలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏ సినిమాకు డేట్స్ ఇస్తారో ఆయనకే తెలియదు. అజ్ఞాతవాసిలో త్రివిక్రమ్ చెప్పినట్లు.. వీడి చర్యలు ఊహాతీతం అనిపిస్తున్నారు పవర్ స్టార్.  పవన్ కళ్యాణ్ ఓకే అనాలే కానీ ఆయనకు కోట్ల రూపాయలు అడ్వాన్సులు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఆయనదే చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, డివివి ఎంటర్‌టైన్మెంట్స్, ఏఎం రత్నం సూర్య మూవీస్ నుంచి భారీ అడ్వాన్సులు అందుకున్నారు పవన్. ఇప్పుడు అందరి సినిమాలకు డేట్స్ ఇచ్చేస్తున్నారు. హరిహర వీరమల్లు తర్వాత.. సుజీత్, హరీష్ శంకర్ సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్.

మొన్నటివరకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేనట్లే కనిపించిన పవన్.. ఉన్నట్లుండి ఒకేసారి ఇన్నేసి ప్రాజెక్టులు ఓకే చేయడానికి.. డేట్స్ ఇవ్వడానికి డబ్బే కారణం. జనసేన పార్టీ కార్యకలాపాలు నడపాలంటే ఖర్చు కోట్లలోనే ఉంటుంది. దానికోసం తనకు సినిమాలు తప్ప మరో ఆప్షన్ లేదంటున్నారు పవర్ స్టార్. పైగా ఎన్నికలు కూడా దగ్గరికొస్తున్నాయి. దాంతో అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకు సినిమాలు చేస్తున్నారు జనసేనాని.

ఇతరులు ఇచ్చిన విరాళాలతో తాను పార్టీని నడపడం లేదని.. సొంత డబ్బులతో నడుపుతున్నానని ఇప్పటికే చెప్పారు పవన్. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఆ ఖర్చును లెక్కలేసుకుని.. ఆ లోపే వీలైనన్ని సినిమాలు చేయాలని చూస్తున్నారు పవన్. ఎంత కాదన్నా సినిమాకు 50 నుంచి 60 కోట్ల వరకు తీసుకుంటున్నారు పవన్. ప్రస్తుతం క్రిష్, సుజీత్, హరీష్ శంకర్ సినిమాలకు కమిటయ్యారు.. వీటితో పాటు సురేందర్ రెడ్డి. సముద్రఖని లైన్‌లో ఉన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!