K. Viswanath and NTR: ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌కు మధ్య ఆ విషయంలో గొడవ జరిగిందా.?

దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవలే విశ్వనాథ్ కాలం చేశారు. . ఆయన మరణ వార్తను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

K. Viswanath and NTR: ఎన్టీఆర్‌, విశ్వనాథ్‌కు మధ్య ఆ విషయంలో గొడవ జరిగిందా.?
K Viswanath, Ntr
Follow us

|

Updated on: Feb 05, 2023 | 3:28 PM

కళా తపస్వి.. తెలుగు కళామ్మ తల్లి ముద్దుబిడ్డ.. తెలుగు సినిమా స్థాయిని అప్పట్లోనే ఆకాశానికి చేర్చిన మహనీయుడు కే విశ్వనాథ్. ఎన్నో ఆణిముత్యాలాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆయన. శంకరాభరణం, సిరివెన్నెల, సిరి సిరి మువ్వా, సాగర సంగమం, ఆపద్బాంధవుడు, స్వాతి ముత్యం, స్వర్ణకమలం వంటి ఎన్నో అద్భుతాలను తెరకెక్కించారు విశ్వనాథ్. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. ఇటీవలే విశ్వనాథ్ కాలం చేశారు. . ఆయన మరణ వార్తను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పరిశ్రమలో మరో మహాశకం ముగిసిందంటూ సినీ ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు. అద్భుతమైన కళాత్మకమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి.. శాస్త్రీయ సంగీతానికి వెండితెరపై పట్టాభిషేకం చేసారు విశ్వనాథ్. అయితే నందమూరి తారకర రామారావుకు విశ్వనాథ్ కు మధ్య గొడవ జరిగిందని ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

అయితే కే విశ్వనాథ్ కు ఎన్టీఆర్ కు మధ్య చిన్న పాటి గొడవ జరిగిందని దాని కారణంగా ఈ ఇద్దరు మధ్య 14ఏళ్లు మాటలు లేవని ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అసలు విషయం ఏంటంటే.. డబ్బుకు లోకం దాసోహం అనే సినిమాకు ముందుగా విశ్వనాథ్ దర్శకత్వం వహించాల్సి ఉండగా ఎన్టీఆర్ ఆయనని తొలగించి యోగానంద్ ను డైరెక్టర్ గా తీసుకున్నారట. నిజానికి అప్పటికి విశ్వనాథ్ డేట్స్ దొరక్కపోవడంతో ఎన్టీఆర్ ఆయనకు అత్యంత సన్నిహితుడైన  యోగానంద్ తో ఆ సినిమా చేశారు. ఈ కారణంగానే విశ్వనాథ్ కు ఎన్టీఆర్ కు మధ్య మాటలు లేవని రూమర్స్ పుట్టుకొచ్చాయి.

కానీ అలాంటి దేమీ లేదు. నిజానికి అక్కినేని నాగేశ్వరావుతో విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. ఆయన ఎన్టీఆర్ ప్రియా దర్శకుడు.. ఎన్టీఆర్ తో వరుసగా నాలుగు సినిమాలు చేశారు విశ్వనాథ్. 1980లో వచ్చిన శంకరాభరణం సినిమా సమయంలోను ఎన్టీఆర్ ఆ మూవీ షూటింగ్ కు వెళ్లి విశ్వనాథ్ ను కలిసిన ఫోటోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

Ntr

Ntr

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం