Venkatesh Daggubati : వెంకీ బర్త్ డేకి అదిరిపోయే సర్‌ప్రైజ్.. రీరిలీజ్ కానున్న ఆ సూపర్ హిట్ సినిమా

దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఆ ఒక్కరోజులో పోకిరి సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సినిమాలు కూడా రీరిలీజ్ అయ్యాయి. తాజాగా మరో స్టార్ హీరో సినిమా కూడా రీరిలీజ్ కానుంది.

Venkatesh Daggubati : వెంకీ బర్త్ డేకి అదిరిపోయే సర్‌ప్రైజ్.. రీరిలీజ్ కానున్న ఆ సూపర్ హిట్ సినిమా
Venkatesh Daggubati
Follow us

|

Updated on: Dec 07, 2022 | 2:33 PM

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ క్రియేట్ అయ్యింది. స్టార్ హీరోల పాత సినిమాలు రీరిలీజ్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోల సినిమాలు రీరిలీజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ను మహేష్ పుట్టిన రోజు కానుకగా 4కే వర్షన్ లో రిలీజ్ చేశారు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. ఆ ఒక్కరోజులో పోకిరి సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సినిమాలు కూడా రీరిలీజ్ అయ్యాయి. తాజాగా మరో స్టార్ హీరో సినిమా కూడా రీరిలీజ్ కానుంది. సీనియర్ హీరో వెంకటేష్ సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇంతకు అది ఏ సినిమా అంటే..

డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు. వెంకీ బర్త్ డే నారప్ప సినిమాను రిలీజ్ చేయనున్నారు. విక్టరీ వెంకటేష్ బర్త్ డే కానుకగా డిసెంబర్13న ‘నారప్ప’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా, సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ‘నారప్ప’ లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీలో విడుదలై బిగ్గెస్ట్ హిట్ ని అందుకుంది.

అయితే ‘నారప్ప’ ని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆశపడ్డారు అభిమానులు. ‘నారప్ప’ థియేటర్స్ విడుదల కాకపోవడంతో నిరాశ చెందారు. ఇప్పుడు ‘నారప్ప’ థియేటర్స్ లో విడుదలౌతుండటంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఓటీటీలో విడుదలైన సినిమాని థియేటర్స్ లో విడుదల చేయడం ఇదే తొలిసారి. దీంతో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..