Varun Tej : దీపావళి కానుకగా రానున్న వరుణ్ తేజ్ ‘గని’.. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్న మెగా ప్రిన్స్

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గని. గడ్డలా కొండ గణేష్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో..

Varun Tej : దీపావళి కానుకగా రానున్న వరుణ్ తేజ్ 'గని'..  ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్న మెగా ప్రిన్స్
Ghani
Follow us

|

Updated on: Aug 05, 2021 | 10:05 PM

Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గని. గద్దల కొండ గణేష్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘గని’ ఒకటి. గని సినిమాను అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తుంది. కరోనా కారణంగా ఆలస్యంగా సెట్స్ పైకి వెళ్లినప్పటికీ, పక్కా ప్లానింగుతో షూటింగు కొనసాగుతోంది. ఇప్పటికే చాలావరకూ షూటింగు కానిచ్చేశారు. ‘టైటాన్స్’ ‘సుల్తాన్’ వంటి చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్ – వ్లాడ్ రింబర్గ్ ”గని” చిత్రానికి యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు.

బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్‌‌‌‌గా కనిపించడానికి వరుణ్ తేజ్ భారీ వర్కౌట్స్ చేసి పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్‌‌‌‌ని మార్చుకున్నాడు. ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను దీపావళికి థియేటర్లలో విడుదల చేయనున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ కొంతసేపటి క్రితం ఒక పోస్టర్‌‌ను రిలీజ్ చేశారు. బాక్సింగ్ రింగ్ లో ఉన్న వరుణ్ తేజ్ బ్యాక్ సైడ్ పోస్టర్‌‌ని వదిలారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Big Boss 5: బిగ్‌బాస్‌ 5 మరో అప్‌డేట్.. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకోనుంది ఆ యూట్యూబ్‌ స్టారేనా?

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదు.. వీరందరూ ఫిక్స్ అట !

Anasuya Bharadwaj : డిఫరెంట్ గెటప్‌‌‌లో బుల్లితెర బ్యూటీ.. ‘పుష్ప’ షూటింగ్ నుంచి లీకైన అనసూయ లుక్..