మహేశ్ కోసం బాలీవుడ్ బ్యూటీ.. అదిరిపోయే ప్లాన్ వేసిన ‘సర్కారు వారి పాట’ మూవీ మేకర్స్..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో మహేష్‏కు జోడిగా హీరోయిన్ కీర్తీ సురేష్

  • Rajitha Chanti
  • Publish Date - 7:34 am, Mon, 25 January 21
మహేశ్ కోసం బాలీవుడ్ బ్యూటీ.. అదిరిపోయే ప్లాన్ వేసిన 'సర్కారు వారి పాట' మూవీ మేకర్స్..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాలో మహేష్‏కు జోడిగా హీరోయిన్ కీర్తీ సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ దుబాయ్‏లో ప్రారంభం కానుంది. ఇప్పటికే మహేష్, కీర్తీ సురేష్‏తోసహ చిత్రయూనిట్ మొత్తం దుబాయ్ చేరుకుంది. తాజాగా ఈ సినిమా గురించి మరో టాక్ వినిపిస్తోంది.

మహేష్ నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమా ఓ స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఇందులో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలాను తీసుకోనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు పరశురామ్ దర్వకత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీ రౌటేలాను చిత్రబృందం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read:

Rashi Khanna: ప్రకృతిలో ఒడిలో అందాల తార వర్కవుట్‌ వీడియో.. వైరల్‌గా మారిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌..