ET TOP9 News: ‘జగనే కరెక్ట్.. ఇండస్ట్రీ వాళ్లు జోకర్లు’.. ‘సాయి పల్లవి మైండ్ పాడైంది..’ రాజాసింగ్ తీవ్ర విమర్శలు

Rajeev Rayala

Rajeev Rayala | Edited By: Shaik Madarsaheb

Updated on: Jun 18, 2022 | 10:00 PM

తమిళ హీరో గోకుల్ ను తాజాగా పెళ్లి చేసుకుంది యాంకర్ టూ యాక్టరస్ గా మారిన మధుశాలిని. హోం టౌన్ హైదరాబాద్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోట్టలో కొద్ది మంది బంధువులు,..

ET TOP9 News: 'జగనే కరెక్ట్.. ఇండస్ట్రీ వాళ్లు జోకర్లు'.. 'సాయి పల్లవి మైండ్ పాడైంది..' రాజాసింగ్  తీవ్ర విమర్శలు
Top 9 Et

01. Madhu Shalini (పెళ్లిపీటలెక్కిన ఆర్జీవీ హీరోయిన్ )
తమిళ హీరో గోకుల్ ను తాజాగా పెళ్లి చేసుకుంది యాంకర్ టూ యాక్టరస్ గా మారిన మధుశాలిని. హోం టౌన్ హైదరాబాద్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోట్టలో కొద్ది మంది బంధువులు, ఫ్రెండ్స్ మధ్యలో ఈ వేడుక జరిగింది. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ రాసుకొచ్చింది మధుశాలిని.

02. Kamal Hasan( రికార్డులు కొల్లగొడుతోన్న లోకనాయకుడు )
అకార్డింగ్ టూ లేటెస్ట్ రిపోర్ట్స్ విక్రమ్‌ సినిమా తాజాగా 350 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఇక రీజనల్‌గా కోలీవుడ్ వరకే చూస్తే… దాదాపు 140 కోట్లను కొల్లగొట్టింది కమల్‌ విక్రమ్ ఫిల్మ్. ఇది ఈ ఏడాది కోలీవుడ్‌ లో వచ్చిన బిగ్ ఫిగర్ . దీంతో కమల్ పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నారట. ఈ జోష్‌తో మరన్ని సినిమాలు చేసేందుకు ప్లాన్ కూడా చేసుకుంటున్నారట.

03. Hrithik(స్టార్ హీరో ఇంట విషాదం)
బాలీవుడ్ మాచో మ్యాన్ హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంత గానో ప్రేమించే.. అమ్మమ్మ పద్మారాణీ ఓం ప్రకాశ్‌.. మరణించారు. 91 ఏళ్ల వయసు ఉన్న పద్మారణీ ఓం ప్రకాశ్‌ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జూన్ 17 అర్థరాత్రి మరణించారు.

04. Sada(కన్నీముమున్నీరైన సదా)
ఇక ఇప్పటికే ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు మేజర్ సినిమాకు చూసి ఎమోషనల్ అవుతున్నారు. మేజర్ సందీప్‌ జీవితాన్ని నీరాజనాలుపడుతున్నారు. ఈ క్రమంలో.. హీరోయిన్ సదా కూడా మేజర్ సినిమా చూశారు. చూడడమే కాదు.. మేజర్ సినిమా చూస్తూ.. ఏడ్చేశారు. ఇక ఈ సీన్‌ను వీడియో తీసిన మేజర్ టీం.. ఆ వీడియోను తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్లో పంచుకుంది.

05.Bandla(ఎవరినీ నమ్మోదంటున్న బండ్లన్న )
నటుడిగా.. నిర్మాతగా.. అంతకు మించి పవన్ భక్తుడిగా అందరికీ తెలిసిన బండ్ల.. ఉన్నట్టుండి ‘జీవితం లో ఎవరినీ నమ్మొద్దంటూ’ ఓ ఆడియో మెసేజ్‌ను తన సోషల్ మీడియా హ్యాండిలింగ్స్లో పంచుకున్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నమ్ముకుందాం. మనల్ని నమ్మి వచ్చిన జీవిత భాగస్వామిని, మన పిల్లల్ని ప్రేమిద్దాం. వాళ్లకి మంచి భవిష్యత్తుని, అందమైన జీవితాన్ని ఇద్దాం. అంటూ ఆడియో మెసేజ్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు.

06. Virata Parwam(విప్లవ భావోద్వేగాలు పూయిస్తోన్న విరాటపర్వం)
తాజాగా విరాట పర్వం సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. విరాట పర్వం సినిమా కోసం వారు పడిన కష్టాన్నిఆ వీడియోతో అందరికీ చూపించేశారు. ఇక జూన్ 17న రిలీజైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చాలా కాలం తరువాత అందరిలో విప్లవ భావోద్వేగాలను పూయిస్తోంది.

07. Deepika(అదంతా అవాస్తవం అంటున్న దీపికా)
దీపిక అనారోగ్యం కారణంగా ప్రభాస్ ప్రాజెక్ట్ k ఫిల్మ్ ఆగిపోలేదని అనౌన్స్ చేశారు నాగ్ అశ్విన్ టీం. ప్రాజెక్ట్ K ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అంటూనే.. షెడ్యూల్ ప్రకారమే ఈ సినిమా షూట్ జరుగుతుందంటూ క్లారిటీ ఇచ్చింది.

08. RGV(జగన్ కరెక్ట్ )
అప్పట్లో సినిమా రేట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని చాలా గట్టిగా డిమాండ్ చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఇప్పుడు నాలుకు కరుచుకుంటోంది. టికెట్ రేట్ భారీగా పెరగడంతో.. థియటేర్లకు రాని జనాలను చూస్తూ.. బాధపడుతోంది. వారిని థియేటర్‌కు రప్పించేందుకు టికెట్టు రేట్లు తగ్గిస్టూ.. నానా తంటాలు పడుతోంది. ఇదే విషయమై తాజాగా రియాక్టయ్యారు రామ్‌ గోపాల్ వర్మ. జగనే నిర్ణయం కరెక్ట్ అంటూ.. ఇండస్ట్రీలో మేమందరం జోకర్లయ్యాం అంటూ తాజాగా ఓ ఇంటర్య్వూలో కామెంట్ చేశారు ఆర్జీవీ. అంతేకాదు తమది బ్లెండర్ మిస్టేక్ అంటూ ఒప్పుకున్నారు వర్మ.

09. Raja singh(మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదన్న రాజాసింగ్)
సాయి పల్లవి కాంట్రవర్సీ కామెంట్స్ పై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా రియాక్టయ్యారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదని, జనం తిరగబడి కొడతారంటూ సాయి పల్లవి మాటలపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌.. సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి సాయి పల్లవి మైండ్ పాడుచేసుకుందన్నారు. కాశ్మీర్ కి వెళ్లి పండితులను కలిస్తే జరిగిన ఘోరాలు తెలుస్తాయని.. వాస్తవాలు మాట్లాడే దమ్ము సాయి పల్లవికి లేదని ఆయన విమర్శించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu