Trisha Krishnan: ఐదోసారి ఆ స్టార్ హీరోతో జతకట్టనున్న చెన్నై చంద్రం త్రిష

త్రిష.. కుర్రాళ్ళ కలలరాకుమారిగా ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీని ఊపేసింది ఈ భామ. వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షులను తన అందం, అభినయంలో తడిపేసింది ఈ చిన్నది.

Trisha Krishnan: ఐదోసారి ఆ స్టార్ హీరోతో జతకట్టనున్న చెన్నై చంద్రం త్రిష
Trisha
Follow us

|

Updated on: Aug 09, 2022 | 9:24 AM

త్రిష(Trisha Krishnan).. కుర్రాళ్ళ కలలరాకుమారిగా ఒకానొక సమయంలో సినిమా ఇండస్ట్రీని ఊపేసింది ఈ భామ. వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షులను తన అందం, అభినయంలో తడిపేసింది ఈ చిన్నది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించిన త్రిష స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించింది. మెగాస్టార్ , నాగార్జున , వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు. మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలతోనూ నటించి మెప్పించింది. ఇక తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ అమ్మడు తన సత్తా చాటింది. అక్కడ కూడా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు జోరు తగ్గిందనే చెప్పాలి. ఆచితూచి సినిమాలు చేస్తోంది త్రిష. ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి మెప్పిస్తోంది. ఇక తమిళ్ లో ఈ అమ్మడికి క్రేజీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇదిలా ఉంటే త్రిష ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాలో నటించనుందని తెలుస్తోంది. అయితే ఇది మొదటి సారి కాదు.. ఆ స్టార్ హీరోతో 5వ సారి జతకట్టనుందట త్రిష.

దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడి పల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఇటీవలే లోకేష్ విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దళపతి విజయ్ తో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సమంత ను  ఎంపిక చేయగా మరో హీరోయిన్ గా త్రిష పేరును పరిశీలిస్తున్నారట. గతంలో విజయ్ తో కలిసి నాలుగు సినిమాల్లో నటించారు త్రిష.అయితే చాలా కాలం తర్వాత త్రిష విజయ్ కలిసి నటించనుండటం తో విజయ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన విడుదల అయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.