‘మా’ వివాదం..సెట్ చేస్తున్న ఆ ముగ్గురు స్టార్స్ ఎవరు..?

మూవీ ఆర్టిస్ట్ అసోసిసియేషన్(మా) రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. అదేంటో కానీ ఓ ఆర్నెల్లు సైలెంట్‌గా ఉండటం..ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువు అవ్వడం ‘మా’ కు పరిపాటిగా మారింది. ‘మా’ తాజా అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ ఒక మీటింగ్ నిర్వహించి నరేష్‌ను దించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వర్గం సభ్యుల ఆరోపణ. మీటింగ్‌కు నరేష్ తప్ప చాలామంది సభ్యులంతా హాజరయ్యారు. నరేశ్ వైపు శివబాలాజీ, […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:57 pm, Sat, 26 October 19
'మా' వివాదం..సెట్ చేస్తున్న ఆ ముగ్గురు స్టార్స్ ఎవరు..?

మూవీ ఆర్టిస్ట్ అసోసిసియేషన్(మా) రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. అదేంటో కానీ ఓ ఆర్నెల్లు సైలెంట్‌గా ఉండటం..ఒక్కసారిగా వివాదాలకు కేంద్రబిందువు అవ్వడం ‘మా’ కు పరిపాటిగా మారింది. ‘మా’ తాజా అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే ‘మా’ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ ఒక మీటింగ్ నిర్వహించి నరేష్‌ను దించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వర్గం సభ్యుల ఆరోపణ. మీటింగ్‌కు నరేష్ తప్ప చాలామంది సభ్యులంతా హాజరయ్యారు. నరేశ్ వైపు శివబాలాజీ, రాజీవ్ కనకాల లాంటి నటులు ఉన్నా వారు పెద్దగా నోరు మొదపడం లేదు. నరేశ్ ఒక్కరే ఎక్స్‌పోజ్ అవుతున్నారు.  ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు మటాల తూటాలు పేల్చుకున్నారు. సభ్యులకు సర్దుచెబుతామని ప్రయత్నించిన పరుచూరి గోపాలకృష్ణ పెద్దరికం కూడా పని చెయ్యకపోవడంతో ఆయన సమావేశం మధ్యలోనేనుంచే బయటకు వెళ్లిపోయారు.

‘మా’ ప్రతిష్ఠను పదే, పదే దిగజార్చుతుండటంతో..ఇండస్ట్రీలోని ఒకప్పటి స్టార్ హీరోలు రంగంలోకి దిగినట్టు సమాచారం.  చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు..‘మా’  పరిణామాలపై రహస్య భేటీ నిర్వహించినట్టు తెలిసింది. ఇప్పటివరకు ‘మా’ లో జరిగిన పరిణామాలపై విసృతంగా చర్చించారంట. ఎవరిది తప్పు ఉంది..ఎవరిని కాస్త సర్దికుపోవాలని చెప్పే విషయంలో కూడా ఓ క్లారిటీకి వచ్చారని టాక్. కానీ ప్రస్తుతం ‘మా’ కి పలుమార్లు అధ్యక్షుడిగా వ్యవహరించిన, అక్కడి వ్యవహారాలపై పట్టున్న మురళీ మోహన్‌ అనారోగ్యంతో బాధపడుతుండటంతో…కోలుకున్న తర్వాత ఆయనతో చర్చించి..దీపావళి తర్వాత ‘మా’ సభ్యులతో  భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పెద్దల మాటైనా విని ‘మా’  లో విభేదాలు మర్చిపోయి అందరూ కలిసికట్టుగా కదులుతారా..? లేదా ఎప్పటిలానే మీడియా ముందు రచ్చ చేస్తారా అనేది చూడాలి.