
పాన్‌ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తున్నాం మనం. వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ వరకూ వెళ్లాం. ఒక్కో హీరోకి వంద కోట్లకు మించి రెమ్యునరేషన్ ఇస్తున్నాం. కొత్త సినిమా రిలీజ్ అయితే.. వారంలోనే కలెక్షన్స్ రాబట్టుకోవడం కోసం టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకూ పర్మిషన్ ఇస్తున్నాం. ఇంతింత ఖర్చు పెడుతున్న సినీ పరిశ్రమ.. ఒక సినీ కార్మికుడొచ్చి తనకు 400 రూపాయల వేతనం పెంచమని అడిగితే ఇంత రాద్ధాంతం ఏంటసలు? అది కూడా మూడేళ్ల తరువాత అడుగుతుంటే అవతలకి పొమ్మనడమేంటి? పైకి ’30 శాతం’ అనే నెంబర్ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. సగటు కార్మికుడికి పెరిగేది 300, 400 రూపాయలే. దానికే.. ఇండస్ట్రీలో మాఫియా, ఇండస్ట్రీలో దందా, ఇండస్ట్రీలో టాలెంట్ తొక్కేస్తున్న యూనియన్లు అనే మాటలేంటి? కొందరు నిర్మాతల నుంచి ఎందుకొస్తున్నాయి ఈ కామెంట్లు? మరోసారి చెప్పుకుందాం అదే మాటని. రోజువారీ వేతనాన్ని 400 పెంచండయ్యా అని అడుగుతుంటే.. కొందరు నిర్మాతలు కొత్త సమస్యను పుట్టిస్తున్నారు. టాపిక్‌ను మరోవైపుకు డైవర్ట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో టాలెంట్ దొరకడం లేదట. చాలా పెద్ద స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు ఒకరిద్దరు నిర్మాతలు. సరే టాలెంట్ దొరకడం లేదు అనుకుందాం. ఆ స్కిల్స్ నేర్పించాల్సింది ఎవరు? ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇండియన్ సినిమానే ఛాలెంజ్ చేసే రేంజ్‌కి వెళ్లిన ఇండస్ట్రీ.. తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ హంట్ చేయలేదా? ఉన్నవి 24 క్రాఫ్ట్స్. అంటే 24 విభాగాలు. ఏం.. వాటిని డెవలప్‌చేసుకోడానికి స్కిల్ ప్రోగ్రామ్ పెట్టుకోలేదా?...