Tollywood: రిలీజ్‌కు మోక్షం లభించని సినిమాలు ఇవే.. రిలీజ్ డేట్స్ విషయంలో నో క్లారిటీ

అన్ని ఇండస్ట్రీస్ పూర్తిగా రివైవ్ అయ్యాయి. స్మాల్ స్కేల్ సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు అన్ని రకాల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి.

Tollywood: రిలీజ్‌కు మోక్షం లభించని సినిమాలు ఇవే.. రిలీజ్ డేట్స్ విషయంలో నో క్లారిటీ
Tollywood
Follow us

|

Updated on: Apr 25, 2022 | 8:41 PM

Tollywood: అన్ని ఇండస్ట్రీస్ పూర్తిగా రివైవ్ అయ్యాయి. స్మాల్ స్కేల్ సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వరకు అన్ని రకాల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలు కోల్డ్ స్టోరేజ్‌లోనే ఉండిపోయాయి. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తయినా.. రిలీజ్‌ అప్‌డేట్ ఇచ్చేందుకు మాత్రం ముందుకు రావటం లేదు మేకర్స్‌. ఇంతకీ ఏంటా సినిమాలు అనుకుంటున్నారా.. ఇండస్ట్రీ ఇంత ఊపుమీదకొచ్చినా కొన్ని సినిమాలు మాత్రం మినిమమ్ సౌండ్ ఇవ్వకుండా సైలెంట్‌మోడ్‌లోనే ఉండిపోయాయి. రానా హీరోగా వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ డ్రామా విరాటపర్వం. నక్సలిజం నేపథ్యంతో రూపొందిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీ చాలా రోజుల కిందటే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక సాంగ్‌, రెండు టీజర్స్‌ రిలీజ్ చేసి ప్రమోషన్‌లో కూడా స్పీడందుకుంది. ఈలోగా థర్డ్ వేవ్‌ రావటంతో విరాటపర్వానికి సడన్‌ బ్రేక్ పడింది. తరువాత పరిస్థితులు సెట్‌రైట్ అయినా రిలీజ్ విషయంలో డెసిషన్ తీసుకోవట్లేదు విరాటపర్వం టీమ్‌.

దాదాపు ఇదే రేంజ్‌ సైలెన్స్ మెయిన్‌టైన్ చేస్తోంది నాగచైతన్య మూవీ థాంక్యూ. కోవిడ్ సిచ్యుయేషన్‌లోనే రిస్క్ చేసిమరీ మాస్కో వెళ్లి షూటింగ్ పూర్తి చేసింది థాంక్యూ టీమ్‌. 2020 అక్టోబర్‌లో స్టార్ట్ చేసి 2022 ఫిబ్రవరిలో ఫినిష్ చేశారు డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. కోవిడ్ కారణంగా షూటింగ్ డీలే అయ్యిందనుకున్నా.. ప్రొడక్షన్‌ వర్క్ పూర్తయ్యేసరికి పరిస్థితులు చక్కబడ్డాయి. అయినా రిలీజ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు మేకర్స్‌. చైతూతోనే ఓ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నారు విక్రమ్‌కుమార్. అంతకుముందే కంప్లీట్ చేసిన థాంక్యూ మూవీ రిలీజ్ ఎప్పుడన్న విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటనా లేదు. ఇలా చాలాకాలంగా డైలమాలో ఉన్న కల్యాణ్ రామ్ బింబిసార, నిఖిల్‌ 18 పేజెస్‌, గోపిచంద్ పక్కా కమర్షియల్ లాంటి సినిమాలు ఈ మధ్యే రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ ఇచ్చాయి. మరి.. విరాటపర్వం, థాంక్యూ మేకర్స్‌ ఇప్పటికైనా స్పందిస్తారేమో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood drugs case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. క్షమాపణలు కోరారు ఎక్సైజ్ డైరెక్టర్‌..

KGF 2 Collections: ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ చేసిన రాఖీభాయ్.. హిందీలో కేజీఎఫ్ 2 హావా ఇదే..

Upcoming Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో వచ్చే సినిమాలు ఇవే.. ఆచార్యతోపాటు ఇవి కూడా..