Vijay Sethupathi: దటీజ్ మక్కల్ సెల్వన్.. వృద్ధురాలి కాళ్లకు నమస్కరించి సెల్ఫీ ఇచ్చిన సేతుపతి.. వీడియో
సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో స్థాయికి చేరుకున్న విజయ్ సేతుపతి తన అభిమానులకు చాలా గౌరవం, మర్యాద ఇస్తాడు. బహిరంగ ప్రదేశాల్లో ఫ్యాన్స్ అడిగినప్పుడల్లా ఎంతో ఓపికగా ఫొటోలు, సెల్ఫీలు ఇస్తుంటాడు. తాజాగా అలాంటిదే మరొక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పేరుకు తమిళ నటుడు అయినప్పటికీ ఆయనకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టే ఉప్పెన లాంటి తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో మెయిన్ విలన్ గా నటించి మెప్పించాడు సేతుపతి. గతేడాది షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ ఆడియెన్స్ ను సైతం మెప్పించారాయన. సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరో స్థాయికి చేరుకున్న విజయ్ సేతుపతి తన అభిమానులకు చాలా గౌరవం, మర్యాద ఇస్తాడు. బహిరంగ ప్రదేశాల్లో ఫ్యాన్స్ అడిగినప్పుడల్లా ఎంతో ఓపికగా ఫొటోలు, సెల్ఫీలు ఇస్తుంటాడు. తాజాగా అలాంటిదే మరొక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం (ఏప్రిల్ 19) దేశ వ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. తమిళనాడులోనూ పలు లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. సామాన్యులతో పాటు స్టార్ హీరోలు కూడా ఎంతో ఉత్సాహంగా క్యూ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్, కమల్ హాసన్, ధనుష్, విక్రమ్, అజిత్, శరత్ కుమార్ తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సందర్భంగా వీల్ చైర్‌లో ఉండి నడవలేని వృద్ధురాలు విజయ్ సేతపతిని చూసింది. విజయ్ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఒక సెల్ఫీ ఇవ్వమని కోరింది. అంతే.. విజయ్ సేతుపతి వెంటనే వృద్ధురాలి వద్ద సెల్ ఫోన్ తీసుకున్నాడు. ఆమెతో సెల్ఫీ దిగాడు. అంతేకాదు తల్లి లాంటి వ్యక్తి కావడంతో ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. స్టార్ యాక్టర్ గా క్రేజ్ ఉన్నప్పటికీ ఎంతో సింప్లిసిటీగా వ్యవహరించిన సేతుపతిపై ప్రశంసలు కురిపించాడు అక్కడున్న జనాలు. అదే సమయంలో వీల్ చైర్ పై వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలిపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ సందర్భంగా చాలామంది ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దటీజ్ మక్కల్ సెల్వన్.. విజయ్ సేతుపతిది చాలా గొప్ప మనసు అంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
వృద్ధురాలి కాళ్లకు నమస్కరిస్తోన్న విజయ్ సేతుపతి.. వీడియో ఇదిగో..
#vijaysethupathi 🤗🥰💖💥#Respectful #makkalSelvan pic.twitter.com/aXAY9tsAJO
— SIVA SK ʰʸᵖᵉᵈ ᶠᵒʳ ᵐᵃʰᵃʳᵃʲᵃ 🤴 (@SIVA_SK_SK_07) April 19, 2024
ఓటు హక్కు వినియోగించుకున్న మక్కల్ సెల్వన్..
Actor #VijaySethupathi cast his vote. #LokSabhaElections2024 pic.twitter.com/n8lB9CMpQ0
— THE CHARTERED STUDENT 🔝 (@_ca_student) April 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.