Sivakarthikeyan: ట్రోలింగ్స్ పై స్పందించిన శివకార్తికేయన్.. ఫ్యామిలీని కూడా వదలడం లేదంటూ ఎమోషనల్..

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ట్రోలింగ్స్ పై స్పందించారు. తనంటే ఇష్టం లేనివాళ్లు.. తన గురించి నెగిటివ్ కామెంట్స్ చేశారని.. అంతేకాకుండా కుటుంబంపై కూడా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Sivakarthikeyan: ట్రోలింగ్స్ పై స్పందించిన శివకార్తికేయన్.. ఫ్యామిలీని కూడా వదలడం లేదంటూ ఎమోషనల్..
Sivakarthikeyan
Follow us

|

Updated on: Oct 22, 2022 | 5:27 PM

రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు తమిళ్ హీరో శివకార్తికేయన్. ఈ మూవీ తర్వాత ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నేరుగా ప్రిన్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జాతిరత్నాలు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ అనుదీప్ కెవీ తెరకెక్కించిన ఈ సినిమాపై ముందు నుంచి భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కోలీవుడ్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న శివకార్తికేయన్.. జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

మిమిక్రీ ఆర్టిస్ట్‏గా కెరీర్ స్టార్ట్ చేసిన శివ.. ఆ తర్వాత యాంకర్.. హాస్యనటుడిగా పలు చిత్రాల్లో నటించి..ఆ తర్వాత హీరో అయ్యారు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటించిన ప్రిన్స్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్స్ గురించి స్పందించారు. తననే కాకుండా తన కుటుంబంపై కూడా ట్రోల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

అందులో యాంకర్ మాట్లాడుతూ.. మీకో నిజం చెప్పమంటరా ? మీరంటే నచ్చని వాళ్లు ఎవరూ లేరు.. ఎవ్వరూ మిమ్మల్ని అసహ్యించుకోరు అని అనగా.. “నేనంటే నచ్చిన వాళ్లు చాలా మంది ఉన్నారు. నా ట్విట్టర్ టైమ్ లైన్ లోకి వెళ్లి చూస్తే నన్ను మాత్రమే కాకుండా నా ఫ్యామిలీ మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. అలాంటివి చాలా ఉన్నాయి. కానీ .. ఎక్కువ మంది ప్రజలు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. వారివల్లే ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నారు. మనం ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి.. మనం ఏం చేసినా బాగోలేదని చెప్పడానికి చాలా తేడా ఉంది. మనం దేన్ని పట్టించుకోవడం అన్నదానిపై అంతా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన నన్ను ట్రోల్ చేసిన నేను పట్టించుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!