Taapsee Pannu: చివరికి ఇది కూడా వినాల్సివస్తోంది అంటున్న తాప్సీ.. వైరల్ అవుతున్న ట్వీట్..

మన తరఫున మనం కాకపోతే ఎవరు మాట్లాడతారు.. అంటారు తాప్సీ. పోట్లాడితే పోయేదేమీ లేదు... ట్విట్టర్ ఖాతా తప్ప.. అనేది కంగనా మాట.

Taapsee Pannu: చివరికి ఇది కూడా వినాల్సివస్తోంది అంటున్న తాప్సీ.. వైరల్ అవుతున్న ట్వీట్..
Taapsee Pannu
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2021 | 8:11 AM

Taapsee Pannu: మన తరఫున మనం కాకపోతే ఎవరు మాట్లాడతారు.. అంటారు తాప్సీ. పోట్లాడితే పోయేదేమీ లేదు… ట్విట్టర్ ఖాతా తప్ప.. అనేది కంగనా మాట. సోషల్ మీడియా అంటే… ఫోటో షూట్స్‌ని, వర్కవుట్ వీడియోల్ని పోస్ట్ చెయ్యడానిక్కాదు… మన భావావేశాల్ని సమాజంతో షేర్ చేసుకోడానిక్కూడా అని చేసి చూపెడతారు… సమంత అక్కినేని. నాటోన్లీ గ్లామర్… బట్ ఆల్సో ఎమోషన్స్ అంటున్న తాప్సీ… లేటెస్ట్‌గా మరోసారి తన మార్క్ రియాక్షన్‌ చూపించారు.

ఒక్క పోస్టర్… ఒకే ఒక్క పోస్టర్… అప్పట్లో సమంత మనసును బాధపెట్టింది. సాటి మహిళగా స్పందించకుండా వుండలేకపోయారు. గ్లామర్‌ ఫీల్డ్‌లో క్యూట్‌గా కనిపిస్తూనే… సోషల్ లైఫ్‌లో ఇలా హాట్ షాట్స్‌ ఇవ్వడం కొంతమంది హీరోయిన్లకు మాత్రమే చెల్లు. ఆన్‌స్క్రీన్ కంటెంట్‌తో వచ్చే ఎజిటేషన్‌తో పాటు.. ఇలా ఆఫ్‌స్క్రీన్‌ ఫైటింగ్స్‌ కూడా తప్పడం లేదు క్వీన్స్ ఆఫ్ సిల్వర్‌స్క్రీన్స్‌కి. భార్య సమ్మతి లేకుండా భర్త చేసే కాపురాన్ని అత్యాచారంగా పరిగణించలేం అని భిలాస్‌పూర్ కోర్టు తీర్పునిచ్చింది. కట్టుకున్నవాడి చేతిలో లైంగిక అఘాయిత్యానికి గురై కోర్టుకెక్కిన ఒక అభాగిని కేసులో వెలువడ్డ ఈ తీర్పు… చాలామందిలాగా తాప్సీని కూడా ఆలోచింపజేసింది. చివరికి ఇది కూడా వినాల్సివస్తోంది అంటూ సర్కాస్టిక్‌గా స్పందిస్తూ ట్వీట్ చేశారు తాప్సీ. రిసెంట్‌గా భర్తతో విబేధించి ఎక్స్‌ట్రామారిటల్ ఎఫైర్ పెట్టుకున్న మహిళ పాత్రలో నటించి విమర్శల పాలయ్యారు తాప్సీ. క్రిటిక్స్‌కి సూటిగా సమాధానాలిచ్చి గట్టిగా నిలబడ్డారు కూడా. అటు… ఫైర్‌బ్రాండ్ కంగనా కూడా సామాజిక అంశాల్ని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కాదు. పురచ్చి తలైవి టైపన్నమాట.

స్టార్‌ కిడ్స్‌ మీద అలుపెరుగని పోరాటం చేసి… బాలీవుడ్‌లో నెపోటిజాన్ని రూపుమాపాలని కలలు గన్న కంగనా.. ఆ తర్వాత నెమ్మదించక తప్పలేదు. మోదీకి ఫేవర్‌గా మారి… మహారాష్ట్ర సర్కారు మీద దండయాత్ర మొదలుపెట్టినప్పుడు… ఫలితంగా ట్విట్టర్‌ ఖాతాను పోగొట్టుకోవాల్సి వచ్చింది మణికర్ణిక.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nagarjuna Akkineni: కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్ ఫోటో గ్యాలెరీ.. మీరు ఒక లుక్ వేయండి..

Maestro: మాస్ట్రో అఫీషియల్ డేట్ వచ్చేసింది.. హాట్‌స్టార్‌ ప్రకటించింది.. ఎప్పుడో తెలుసా.!

PV Sindhu: పీవీ సింధుకు సినీ ప్రముఖుల సన్మానం.. వీడియోను షేర్‌ చేసిన చిరంజీవి

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?