డ్యాన్స్‌లు లేవు..కానీ అంతకుమించిన ‘ఐ ఫీస్ట్’ ఉంది..ఏంటది?

తెలుగు సినిమా కొత్త రూపు సంతరించుకుంటుంది. కొత్త హీరోస్‌తో పోటీ పడుతూ..సీనియర్ హీారోస్ విభిన్న కథాంశంతో కూడిన సినిమాలతో, వయసుకు తగ్గ పాత్రలతో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మధ్య ఎంత క్లాష్ ఉన్నా.. తెలుగు సినిమా హిస్టరీలో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీారోలు అన్న ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ. వీరు చేసిన సినిమాలు అలాంటివి. ఇక ఈ రోజు వెండితెర ఎవర్‌గ్రీన్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో బాక్సాఫీస్ వైపు దండెత్తాడు. ఈ ఊచకోత […]

డ్యాన్స్‌లు లేవు..కానీ అంతకుమించిన 'ఐ ఫీస్ట్' ఉంది..ఏంటది?
Ram Naramaneni

|

Oct 02, 2019 | 5:27 PM

తెలుగు సినిమా కొత్త రూపు సంతరించుకుంటుంది. కొత్త హీరోస్‌తో పోటీ పడుతూ..సీనియర్ హీారోస్ విభిన్న కథాంశంతో కూడిన సినిమాలతో, వయసుకు తగ్గ పాత్రలతో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మధ్య ఎంత క్లాష్ ఉన్నా.. తెలుగు సినిమా హిస్టరీలో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న హీారోలు అన్న ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ. వీరు చేసిన సినిమాలు అలాంటివి. ఇక ఈ రోజు వెండితెర ఎవర్‌గ్రీన్‌ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో బాక్సాఫీస్ వైపు దండెత్తాడు. ఈ ఊచకోత మాములుగా లేదు. చిరు నటవిశ్వరూపానికి ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. కానీ ఒక్కటే లోటు అన్నయ్య సినిమా అంటే..డ్యాన్స్, కామెడీ బాగా కోరుకుంటారు అభిమానులు. కానీ ఫ్రీడమ్ ఫైట్‌కు సంబంధించిన చిత్రం కావడంతో అవి కుదరలేదు. అయితేనేం..ఇంతకుముందు ఎప్పుడూ చూడని చిరంజీవి సిల్వర్ స్రీన్‌పై దర్శనమిచ్చాడు. కత్తి పట్టి చిరు కదనరంగంలోకి దూకుతుంటే..గూస్ బంప్స్ రాని మెగా అభిమాని లేడంటే ఆశ్యర్యం లేదు. 60 ఏళ్లు దాటిన వ్యక్తేనా ఆ పోరాటాలను చేస్తుంది అనిపిస్తుంది.

అలనాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా..పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను నిజంగా ఆకట్టుకుంటాయి. ఇంతకుముందు చిరు చెప్పని డైలాగ్ డిలెవరీ..ఈ సినిమాలో ప్రస్పుటమవుతుంది. గుర్రపు స్వారీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎమోషన్స్‌ సీన్స్‌లో మెగాస్టార్ మార్క్ కొత్తగా అనిపిస్తుంది. సురేంద్రరెడ్డి చిరంజీవి ఇంతకుముందెప్పుడూ చూడని ఎలివేషన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ ఇచ్చాడు. మెగా మేనియాతో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. సో..డ్యాన్స్‌లు, కామెడీ కాదు..కొత్త మెగాస్టార్‌ని చూడ్డానికి థియేటర్లకు పరిగెత్తండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu