ఇది చిరంజీవికే సొంతం..థియేటర్ల వద్ద చొక్కాలు చించుకుంటున్న సినీ జనం

మెగాస్టార్..తెలుగు తెరపై తిరుగులేని స్టార్. అన్న ఎన్టీఆర్ తర్వాత 3 దశాబ్ధాలు పాటు తెలుగు తెరను ఏలిక కథానాయకుడు చిరంజీవి. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి సిల్వర్ స్రీన్‌ లెజెండ్.. ‘ఆంధ్రుల అభిమాన అన్నయ్య’ చిరంజీవి. మధ్యలో 9 ఏళ్ల  రాజకీయ ప్రస్థానం అనంతరం ‘ఖైదీ నెం. 150’ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన బాస్‌లో అదే గ్రేస్..తరగని మాస్ ఫాలోయింగ్. తాజాగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు […]

ఇది చిరంజీవికే సొంతం..థియేటర్ల వద్ద చొక్కాలు చించుకుంటున్న సినీ జనం
Follow us

|

Updated on: Oct 02, 2019 | 4:51 PM

మెగాస్టార్..తెలుగు తెరపై తిరుగులేని స్టార్. అన్న ఎన్టీఆర్ తర్వాత 3 దశాబ్ధాలు పాటు తెలుగు తెరను ఏలిక కథానాయకుడు చిరంజీవి. సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి సిల్వర్ స్రీన్‌ లెజెండ్.. ‘ఆంధ్రుల అభిమాన అన్నయ్య’ చిరంజీవి. మధ్యలో 9 ఏళ్ల  రాజకీయ ప్రస్థానం అనంతరం ‘ఖైదీ నెం. 150’ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చిన బాస్‌లో అదే గ్రేస్..తరగని మాస్ ఫాలోయింగ్. తాజాగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవిత కథాశంతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజైన నేడు రిలీజైన ‘సైరా నరసింహారెడ్డి’..కొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకువెళ్తుంది.

64 ఏళ్ల వయసులో అన్నయ్య స్రీన్ ప్రజెన్స్‌కు, పొరాట సన్నివేశాలకు ప్రేక్షకులు దాసోహం అంటున్నారు. తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన చిరు నటన న భూతో నా భవిష్యతి. ముఖ్యంగా సురేందర్ రెడ్డి టేకింగ్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అమిత్ ద్రివేది బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సైరా.. అంటూ చిరు గుర్రంపై వస్తుంటే  ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.

ఇక చిరంజీవి సినిమా అంటే కవర్‌లో ఓ షర్ట్ పట్టుకుపోవడం అనవాయితీ. ఎందుంకంటే క్యూ లైన్‌లో వేసుకున్నది చినిగిపోవడం కామన్. ఇది 1980 నుంచి 2000 మధ్యకాలంలో సాగింది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఆన్‌లైన్ బుకింగ్స్ వచ్చేశాయి. థియేటర్స్ విసృతంగా వచ్చాయి. ఐమాక్స్, ఐనాక్స్ వంటివి వచ్చిన తర్వాత ఆ హడావిడి పూర్తిగా తగ్గిపోయింది. ఈ మధ్యకాలంలో అటువంటి దాఖలాలు అస్సలు కనిపించడం లేదు. కానీ ఈ రోజు సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా అటువంటి సీన్స్ రిపీటయ్యాయి. అభిమానులు.. అన్నయ్య సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడటానికి అర్ధరాత్రి నుంచే హంగామా షురూ చేశారు. ఐనాక్స్ బయట కూడా బ్లాక్‌లో టికెట్లు అమ్మిన దాఖలాలు ఈ రోజు కంటపడ్డాయి. ప్యాన్స్ చొక్కాలు చించుకున్న సన్నివేశాలు కూడా ఆవిషృతమయ్యాయి. ఇది నిజంగా చిరు మేనియా. ఇది ఏ హీరోకి సాధ్యంకానీ ఫీట్. నెలరోజులు ఆగితే అమెజాన్, నెట్‌ప్లిక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వస్తుంది అనుకోలేదు సినీ జనాలు. ఏది ఏమినా తెలుగు సినిమా జగత్తుపై నీ సినీ ప్రస్థానం అద్వితీయం చిరంజీవి. నీపై అభిమానం రివ్యూలకో, రాజకీయాలకో లొంగోది కాదు . కీప్ ఎంటర్టైన్ హజ్ బాస్.