Sarkaru Vaari Paata: మొదలైన రికార్డుల వేట.. కేజీఎఫ్ 2 ను బీట్ చేసిన సర్కారు వారి పాట

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: మొదలైన రికార్డుల వేట.. కేజీఎఫ్ 2 ను బీట్ చేసిన సర్కారు వారి పాట
Sarkaru Vaari Paata
Follow us

|

Updated on: May 12, 2022 | 8:46 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న మహేష్ దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఈ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. రిలీజ్ కు రెండు రోజుల ముందు ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా టిక్కెట్ల విక్రయాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా టిక్కెట్ల అడ్వాన్స్ బుకింగ్ చూస్తే మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తొలిరోజుల్లో బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయం అని అంచనా వేయవచ్చు. ఈ లెక్కన కేవలం అడ్వాన్స్ బుకింగ్ ఆధారంగానే చెబుతున్నారని, అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అంచనా వేసిన లెక్కల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టవచ్చని అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమా ట్రైలర్ జనాలకు ఎంతగానో నచ్చడంతో హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లో కేజీఎఫ్ చాప్టర్-2ను ‘సర్కారు వారి పాట’ అధిగమించింది. మహేష్ బాబు సినిమా కేజీఎఫ్ 2 కంటే సిటీలో మొదటి రోజు 6 కోట్ల 60 లక్షలు బుకింగ్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. హైదరాబాద్‌లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైన వెంటనే 325 షోలలో 162 షోలు ఫిల్ అయ్యాయి. విదేశాల్లోనూ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. చివరిగా  మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మొత్తం రూ.142 కోట్లు రాబట్టింది. అయితే ‘సర్కారు వారి పాట’ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

Kalyani Priyadarshan: క్యూట్ ఫొటోస్‌తో కేక పెట్టిస్తున్న కుర్ర బ్యూటీ.. వైరల్ అవుతున్న కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోలు

Prabhas: ప్రభాస్ మారుతి మూవీ ‘రాజా డీలక్స్’ వచ్చేది అప్పుడేనా..

Mahesh Babu : బాలీవుడ్ పై మహేష్ బాబు కామెంట్స్ వైరల్.. ఆర్జీవీ రియాక్షన్ ఏంటంటే

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..