Suma Kanakala: గొప్పమనసు చాటుకున్న సుమ.. సర్వత్రా వెల్లువెత్తుతోన్న ప్రశంసలు.. ఎందుకంటే

టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు.

Suma Kanakala: గొప్పమనసు చాటుకున్న సుమ.. సర్వత్రా వెల్లువెత్తుతోన్న ప్రశంసలు.. ఎందుకంటే
Suma Kanakala
Follow us

|

Updated on: Feb 01, 2023 | 11:04 AM

టెలివిజన్ లో స్టార్ యాంకర్ అంటే టక్కున చెప్పే పేరు సుమ కనకాల. ఎంతమంది కొత్త ఏంకర్లు పుట్టుకొచ్చిన సుమ ను మించలేరు. తెలుగమ్మాయి కాకపోయినా సుమ తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అయిన.. టాక్ షోలైనా.. గేమ్ షోలైనా.. తనదైన మాట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు సుమ. స్టార్ హీరోలు సైతం సుమకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అంతలా ఆమె చలాకీగా తెలుగులో మాట్లాడుతూ.. యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. ఇక సుమ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ నటించారు. ఆ తర్వాత యాంకరింగ్ లో దూసుకుపోతున్నారు. సుమ కెరీర్ బినింగ్ లో పలు సీరియల్స్ లో నటించారు అలరించారు సుమ. ఇదిలా ఉంటేఇప్పుడు సుమ చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా సుమ చెన్నై లోని ఒక కాలేజ్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ఆమె సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను పుట్టింది పాలక్కాడ్ లో.. నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. జీవితం అంటేనే పెద్ద ఛాలెంజ్, పోయేవరకు ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది అని అన్నారు సుమ.

అలాగే ”ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్” అనే సంస్థ నా డ్రీం.. ఎందుకంటే నన్ను ఆదరించి ఇంత దాన్ని చేసిన ప్రేక్షకుల కోసం ఏదోకటి చేయాలి అనుకున్నా.. నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను. ఇప్పటికే అమెరికాలో ఉన్న ఎఫ్ ఐ ఏ సంస్థ వాళ్ళు మాతో కొలాబరేట్ అయ్యారు అలాగే జైపూర్ లింబ్స్ డొనేట్ చేశారు” అంటూ సుమ చెప్పుకొచ్చారు దాంతో ఆమెపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.