‘లూసిఫర్’ రిమేక్‌లో చిరు, చరణ్..సీన్‌లోకి మెస్మరైజింగ్ డైరెక్టర్..!

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్  ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మెగాస్టార్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరు పూర్తి న్యాయం చేశారని..ఇండస్ట్రీ మొత్తం కొనియాడుతుంది. తండ్రికి..కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడని అందరూ చర్చించుకుంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో చిరు యమ బిజీ: ఇక ఆ జోష్‌లో ఉండగానే మెగాస్టార్.. కొరటాల శివతో చేయనున్న సినిమాను లాంఛనంగా […]

'లూసిఫర్' రిమేక్‌లో చిరు, చరణ్..సీన్‌లోకి మెస్మరైజింగ్ డైరెక్టర్..!
Follow us

|

Updated on: Oct 12, 2019 | 1:39 PM

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్  ‘సైరా’ చిత్రం అక్టోబర్ 2న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. మెగాస్టార్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు చిరు పూర్తి న్యాయం చేశారని..ఇండస్ట్రీ మొత్తం కొనియాడుతుంది. తండ్రికి..కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడని అందరూ చర్చించుకుంటున్నారు.

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో చిరు యమ బిజీ:

ఇక ఆ జోష్‌లో ఉండగానే మెగాస్టార్.. కొరటాల శివతో చేయనున్న సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేశారు. కొరటాల శివ సెన్సుబుల్ డెరెక్టర్. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మెసేజ్ జోడించి.. అతడు స్టార్ హీరోలతో  తీసిన సినిమాలు బంపర్ హిట్లు అందుకున్నాయి.  ఇంతవరకూ ఒక్క ప్లాపు కూడా తీయకుండా సెంట్ పర్సెట్ సక్సెస్ రేటుతో ముందుకు సాగుతున్న కొరటాల..మెగాస్టార్‌కి పక్కా హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ ఫిక్సయిపోయి సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక పోతే రామ్ చరణ్..మెగా అభిమానుల కోసం మరో క్రేజీ న్యూస్‌ని తీసుకొచ్చాడని ఫిలిం సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. కంప్లీట్ యాక్టర్, మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం లూసిఫర్. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా రీమేక్ హక్కులను చిరంజీవి కోసం.. రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.

మెగాస్టార్‌ని డైరెక్ట్ చేయనున్న సుకుమార్?:

అయితే ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తారా అని ఆసక్తికర చర్చ నడుస్తున్న నేపథ్యంలో..తాజాగా సుకుమార్ పేరు ట్రాక్‌లోకి వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత..మహేశ్ బాబుతో మూవీ చేయాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత సుక్కు..బన్నీతో సినిమా కమిట్ అయ్యాడు. అది కంప్లీట్ అయ్యాక..చిరంజీవి మూవీని టేకోవర్ చేస్తారట. ఈ లోపులో చిరు కూడా..కొరటాల శివ మూవీని సెట్ రైట్ చేసి బయటకు వస్తారు.

మెగా మల్టీస్టారర్‌గా ప్లాన్‌: 

ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే..మోహన్ లాల్ పాత్రలో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తారని సమాచారం. రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్లి’ సినిమాలో చిరు గెస్ట్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో కూడా చిరంజీవితో కలిసి రామ్ చరణ్ స్టెప్పులేశాడు. ఈ రెండు సినిమాలు సిల్వర్ స్రీన్‌ని షేక్ చేశాయి. ఈ మెగా డ్యుయో కాసేపు కనిపిస్తేనే ఇలా ఉంది అంటే..ఫుల్ లెంగ్త్‌లో మెగాస్టార్, మెగాస్టార్ పవర్‌స్టార్ కలిస్తే..ఇక రచ్చరంబోలానే.

తనకు కలిసొచ్చిన దర్శకులను..చిరు కోసం సెలక్ట్ చేస్తున్న చెర్రీ:

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ కోసం దర్శకుడిగా సురేంద్రరెడ్డిని రిఫర్ చేసింది రామ్ చరణే. ఇతడు గతంలో చెర్రీకి ‘ధృవ’ రూపంలో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ‘లూసిఫర్’ రిమేక్ కోసం సుకుమార్‌ని ఫ్రిపర్ చేశాడట చరణ్. ఇటీవలే సుకుమార్..’రంగస్థలం’ రూపంలో చరణ్‌కు ఎటువంటి హిట్ ఇచ్చాడో తెలిసిందే. మొత్తానికి తనకు కలిసొచ్చిన దర్శకులను తండ్రికి కూడా రిఫర్ చేస్తూ..పితృభక్తి చాటుకుంటున్నాడు చరణ్.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!