Jatadhara Movie: ఈ సినిమా నాకు సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది.. సుధీర్ బాబు కామెంట్స్
ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై జటాధర చిత్రం ఇండియన్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసేలా రూపొందుతోంది. ఈ తరహా చిత్రాల రూపకల్పనకు ఇది నాంది పలికేలా కనిపిస్తుంది. సూపర్ నేచురల్ శక్తితో అదరగొట్టే లుక్‌లో సుధీర్ బాబు కనిపిస్తున్నారు.
సుధీర్ బాబు అంటేనే వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. ఇటీవలే సుధీర్ బాబు నవ దళపతి అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సుధీర్ బాబు నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. అనౌన్స్మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం 2025 శివరాత్రి విడుదలకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల కలయికగా ఈ చిత్రం తెరకెక్కుతోందని విడుదలైన పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అలాగే అందులో సుధీర్ బాబు సరికొత్త లుక్‌తో, ఆసక్తికర పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ క్రేజ్ మాత్రం పీక్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?
ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్ బ్యానర్‌పై జటాధర చిత్రం ఇండియన్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసేలా రూపొందుతోంది. ఈ తరహా చిత్రాల రూపకల్పనకు ఇది నాంది పలికేలా కనిపిస్తుంది. సూపర్ నేచురల్ శక్తితో అదరగొట్టే లుక్‌లో సుధీర్ బాబు కనిపిస్తున్నారు. అభిమానులు పోస్టర్‌ను చూసి సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే ఉహాగానాలు చేస్తున్నారు. ఈ విలక్షణమైన సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా! అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్డమ్
ఈ సినిమా గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘‘జటాధర’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు వచ్చిన ఆదరణ చూసి ఆశ్చర్యపోయాను. ఇంత గొప్ప స్పందన రావడంతో సంతోషమేసింది. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను అని అన్నారు. ఈ సినిమాలోకి అడుగు పెట్టటం అనేది ఓ సరికొత్త ప్రపంచాన్ని నాకు పరిచయం చేసింది. నాకు ఇది ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. శాస్త్రీయత, పౌరాణిక అంశాల కలయిక స్క్రిప్ట్‌ను రాశారు. ఈ రెండు జోనర్స్‌కు చెందిన ప్రపంచాలను రేపు ఆడియెన్స్ వెండితెరపై చూస్తున్నప్పుడు ఓ సరికొత్త సినిమా అనుభూతిని పొందుతారు అని తెలిపారు సుధీర్ బాబు. ఓ సినిమా సక్సెస్కైనా కారణం బలమైన స్క్రిప్ట్. దీనికి మంచి టీమ్ తోడైతే అది మంచి సినిమాగా ప్రాణం పోసుకుంటుంది. మా సినిమా విషయంలో అదే జరుగుతుంది. ప్రేరణ అరోరాగారు బెస్ట్ టీమ్‌తో జటాధర సినిమాను ఆవిష్కరిస్తున్నారు. ఆమెతో కలిసి ట్రావెల్ చేయటం గొప్ప అనుభూతి. విజువల్‌గా, ఎమోషనల్‌గా ఓ అద్భుతమైన సినిమాను ఆమె తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన సెకండ్ పోస్టర్ పౌరాణిక ప్రపంచాన్ని తెలియజేస్తుంది. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉండే అంశాలు ఎన్నో ఈ సినిమాలో ఉండబోతున్నాయి. వాటి గురించి తెలియజేయటానికి, ప్రేక్షకులు ఈ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలని నేను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని సుధీర్ బాబు అన్నారు.
ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ప్రస్తుతం జటాధర సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ చిత్రం అలరించనుందని సెకండ్ పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇక హరోంహరతో సూపర్ హిట్ కొట్టిన సుధీర్ బాబు అక్టోబర్ 11న మా నాన్న సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.