మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్ డైరెక్టర్ అల్లుడు.. షాక్‌లో ఇండస్ట్రీ..

స్టార్ దర్శకుడు శంకర్ అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. లైంగిక దాడి ఆరోపణ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది.

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన స్టార్ డైరెక్టర్ అల్లుడు.. షాక్‌లో ఇండస్ట్రీ..
Shankar

స్టార్ దర్శకుడు శంకర్ అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. లైంగిక దాడి ఆరోపణ నేపథ్యంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఇటీవలే శంకర్ తన కుమార్తె ఐశ్వర్యను క్రికెటర్‌ రోహిత్‌ దామోదరన్‌ కు ఇచ్చి వివాహం చేశారు.  16 ఏళ్ల మైనర్‌ బాలికను లైంగిక వేధించారనే ఆరోపణలతో రోహిత్‌, మిగలిన అయిదుగురి పై పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తుంది. క్రికెట్ ప్రాక్టీస్‌కు వచ్చిన మైనర్‌ బాలిక పై రోహిత్ లైంగింక దాడి చేశాడని తెలుస్తుంది. రోహిత్‌, అతడి తండ్రి దామోదరన్‌, కోచ్‌ థమరాయ్‌ కన్నన్‌తో పాటు మరో ఇద్దరిపై పుదుచ్చెరిలోని మెట్టుపాళ‌య‌మ్ పోలీస్ స్టేష‌న్‌లో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తన పై రోహిత్ తోపాటు మరికొందరు లైంగిక దాడికి పాల్పడ్డారని ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించిట్లు చైల్డ్ వెల్ఫేర్ క‌మిటీకి ఇచ్చిన మ‌రో ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. దీంతో రోహిత్‌తో పాటు అతడి తండ్రి, కోచ్‌ మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారని తెలుస్తుంది. ఈ విషయం పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే రోహిత్‌ను నిజంగా పోలీసులు అరెస్ట్ చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ వ్యవాహారం పై తమిళ్ ఇండస్ట్రీలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ సెట్ నుంచి ఫోటో.. షూటింగ్ గ్యాప్‌లో పవన్ -రానా ఏం చేస్తున్నారో చూడండి..!

Samantha : “సమంత జీవితం సోషల్ మీడియాతోనే పెనవేసుకుంది.. ఇప్పుడు కోర్టు కెక్కడమేంటి”

Nandamuri Balakrishna : బాలయ్య టాక్ షోకు ఫస్ట్ గెస్ట్‌గా ఆ హీరో.. నటసింహం ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu