Srinu Vaitla : మహేష్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న ‘దూకుడు’ డైరెక్టర్.. సూపర్ స్టార్ ఓకే చేస్తాడా మరి…

మహేష్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది దూకుడు.దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

Srinu Vaitla : మహేష్ కోసం స్టోరీ రెడీ చేస్తున్న 'దూకుడు' డైరెక్టర్.. సూపర్ స్టార్ ఓకే చేస్తాడా మరి...
Follow us

|

Updated on: Feb 18, 2021 | 8:03 PM

Srinu Vaitla: మహేష్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది దూకుడు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ పోలీస్ గా నటించిన ఈ చిత్రంలో ఆయన బాడీ లాంగ్వేజ్ మరియు తెలంగాణా యాక్సెంట్ ఫ్యాన్స్ కి కొత్త అనుభూతిని పంచాయి. 2011 టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన దూకుడు విడుదలై 10ఏళ్ళు దాటుతున్న సమయంలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దూకుడు’ ఇచ్చిన న‌మ్మ‌కంతో `ఆగ‌డు` తీస్తే.. అది ఫ‌ట్టుమంది. అక్క‌డి నుంచి శ్రీ‌నువైట్ల దూకుడు బాగా త‌గ్గిపోయింది. వ‌రుస ఫ్లాపులు ప‌ల‌క‌రించాయి.

ప్రస్తుతం ఢీ సినిమాకు సీక్వెల్ చేస్తున్నడు. ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబుతో దూకుడు 2 చేయబోతున్నాడట శ్రీను వైట్ల. మహేష్ బాబుకి ‘దూకుడు 2’ స్టోరీ నేరేట్ చేయడానికి వైట్ల శ్రీను ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. అయితే మహేష్ శ్రీను వైట్లకు అవకాశం ఇస్తాడా లేదా అనేది చూడాలి. మహేష్ ప్రస్తుతం చేస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాతి రెండు ప్రాజెక్ట్స్ కూడా ఫైనలైజ్ చేసాడు. మరి ఈ టైం లో శ్రీను వైట్లతో సినిమా ఉంటుందా లేదా అన్నాడని పైన క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సెకండ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న కో’బ్రో’స్.. త్వరలోనే మరిన్ని అప్‏డేట్స్ ఇస్తానంటున్న టాప్ డైరెక్టర్..

Urmila matondkar: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై బాలీవుడ్‌ నటి, శివసేన నాయకురాలు ఊర్మిళ సెటైర్లు