Meghamsh Srihari: ‘రాసిపెట్టుంటే’హిట్ కొడతనంటున్న శ్రీహరి తనయుడు.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన మేఘాంశ్

Meghamsh Srihari: 'రాసిపెట్టుంటే'హిట్ కొడతనంటున్న శ్రీహరి తనయుడు.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన మేఘాంశ్

తన విలక్షణ నటనతో,  విలనిజంతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఆయన హఠాన్మరణం తెలుగు సినిమాను, ఆయన అభిమానులను అంతులేని శోకంలోకి నెట్టింది

Rajeev Rayala

|

Aug 16, 2021 | 8:55 PM

Meghamsh Srihari: తన విలక్షణ నటనతో,  విలనిజంతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దివంగత నటుడు శ్రీహరి. ఆయన హఠాన్మరణం తెలుగు సినిమాను, ఆయన అభిమానులను అంతులేని శోకంలోకి నెట్టింది. ఇదిలా ఉంటే శ్రీ హరి తనయుడు మేఘాంశ్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ కుర్రహీరో రాజ్ దూత్ అనే సినిమాతో హీరోగా అడుగు పెట్టాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు .. కానీ మేఘాంశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంకొంచం కష్టపడితే కుర్రాడు నిలబడతాడని అంతా చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు కోతి కొమ్మచ్చి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఫ్యామిలీ ఎంటర్టైనర్‌‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. కానీ కరోనా వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ లోగానే మేఘాంశ్ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ యంగ్ హీరో త్వరలో ఓ ఇంట్రస్టింగ్ కథతో రానున్నాడు. శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 15న ఈ సినిమాను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.  ఈ సినిమాకి ‘రాసిపెట్టుంటే’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌‌‌ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.  సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాతో నందు మల్లెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. త్వరలోనే  ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు వీలైనంత తొందర్లో ప్రకటిస్తారని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌‌‌‌లో విభిన్నమైన కథలతో కుర్ర హీరోలు ఆకట్టుకుంటున్నారు. కథలో కొత్తదనం ఉంటే ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. ఇప్పుడు అదే నమ్మకంతో ఈ రెండు సినిమాలను పాటలెక్కించాడు మేఘాంశ్. మరి ఈ యంగ్ హీరో ఈ సినిమాలతో ఏ స్థాయి హిట్స్ కొడతాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

షాంపెన్‌ పొంగించి.. పార్టీలో రచ్చ చేసిన సురేఖ వాణీ కూతురు..వైరల్ అవుతున్న వీడియో..:Supritha Video.

Sudheer Babu’s Sridevi Soda Center: అందమైన ప్రేమ కథతోపాటు అదిరిపోయే యాక్షన్ కూడా ఉండనుందట..

Mythri Movie Makers: స్టార్ హీరోల సినిమాలకు తప్పని లీకుల బెడద.. పోలీసులను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్.

Ileana D’Cruz: రీఎంట్రీ ఇవ్వనున్న ఇలియానా.. రవితేజతో కలిసి స్టెప్పులేయనున్న గోవా బ్యూటీ..

Aadi Sai kumar: కొత్త సినిమాను ప్రారంభించిన ఆది సాయి కుమార్.. టైటిల్ ఫిక్స్ చేసిన చిత్రయూనిట్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu