ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్ నటించిన అమరన్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మేజర్ ముకుందన్, అతని భార్య రెబెక్కా వర్గీస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘కంగువ’ లాంటి స్టార్ నటుల భారీ బడ్జెట్ సినిమాలు రిలీజైనా అమరన్ సినిమా కలెక్షన్లు అసలు తగ్గడం లేదు. ఇదిలా ఉంటే అమరన్ తరువాత, రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సెట్స్‌లో శివకార్తికేయన్ కనిపించడం అభిమానులకు ఆసక్తిని కలిగించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా సెట్స్‌పై శివకార్తికేయన్‌కి సంబంధించిన ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు శివకార్తికేయన్‌కి ఓ ఇంటర్వ్యూలో దీనిపై ఓ ప్రశ్న ఎదురైంది. రజనీకాంత్ కూలి సినిమాలో మీరు నటిస్తున్నారా? అన్న ప్రశ్నకు శివకార్తికేయన్ సమాధానమిస్తూ.. ‘కూలీ’ షూటింగ్ మా ఇంటి ముందు జరుగుతోంది. అలాగే లోకేష్ కనగరాజ్, నా ప్రియ మిత్రుడు, మేమంతా తరచుగా కలుస్తుంటాం, అదే కారణంతో అక్కడికి వెళ్లాను తప్ప, ఆ సినిమాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా దేవుడి (రజినీకాంత్) సినిమా ‘ అని శివకార్తికేయన్ చెప్పుకొచ్చారు.
శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ బ్లాక్ బస్టర్ మూవీ. అమరన్ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మించారు . భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్యామ్ ప్రసాద్ తదితర స్టార్ నటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ తన బాడీ షేప్ ను పూర్తిగా మార్చుకున్నాడు. శివకార్తికేయన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. అమరన్ OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. డిసెంబర్ 5 లేదా 10 నుండి అమరన్ ప్రసారం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అమరన్‌కి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది కాబట్టి, థియేటర్ యజమానులు దీనిని OTTలో విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు.
శివకార్తికేయన్ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ డ్యాన్స్ చేసేవారు. ఆ తర్వాత రేడియో జాకీ అయ్యాడు. టీవీ వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కామెడీ, సపోర్టింగ్ రోల్స్‌లో నటించి ఆ తర్వాత లీడ్ యాక్టర్‌గా మారారు. శివకార్తికేయన్ గత కొన్నేళ్లుగా తమిళంలో పైసా వసూల్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. గతంలో ఆయన నటించిన ‘మావీరన్’ (తెలుగులో మహా వీరుడు) కూడా పెద్ద హిట్ అయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.