ప్రముఖ ఫోక్ సింగర్మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగిందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారాయి. కర్ణాటకలోని బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తోన్న ఆమె కారుపై కొందరు ఆకతాయిలు రాళ్లు విసిరినట్లు, ఇందులో కారు అద్దం కూడా పగిలిపోయినట్లు కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు దర్శనమిచ్చాయి. అయితే ఇవన్నీ తప్పుడు వార్తలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మంగ్లీ. తనపై కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నరంటూ మండిపడింది. ఈ మేరకు ఆమె ఓ నోట్ విడుదల చేసింది. ‘ కర్ణాటకలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఫొటోలు, వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా బళ్లారి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నా ఉత్తమ ఈవెంట్లలో ఇది ఒకటి. కన్నడ ప్రజలు, అభిమానులు నాపై కురిపించిన ప్రేమ, మద్దతు అపారమైనది. ఈవెంట్లో నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ ఆనందనాన్ని మాటల్లో వర్ణించలేను. అయితే కొందరు నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారు. ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నా. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని నోట్లో చెప్పుకొచ్చింది మంగ్లీ.
కాగా బళ్లారిలో జరిగిన ఈవెంట్లో మంగ్లీ కన్నడలో మాట్లాడలేదని కొందరు కన్నడ భాషాభిమానులు ఆమె కారు మీద దాడి చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేశాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని ఖండిస్తూ మంగ్లీ క్లారిటీ ఇచ్చింది. కాగా కన్నడ ఇండస్ట్రీలో మంగ్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. కన్నడ దర్శకుడు చక్రవర్తి చంద్రచూడ్ దర్వకత్వం వహిస్తున్న `పాదరాయ`ఈ సినిమాలో మంగ్లీ హీరోయిన్ గా నటించనుంది. కాగా ఏపీ ప్రభుత్వం ఆమెను ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారుగా నియమించిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..