Thalapathy vijay : శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న దళపతి సినిమా..

తమిళ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు తెలుగు దర్శకులతో పనిచేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ధనుష్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

Thalapathy vijay : శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న దళపతి సినిమా..
Vijay
Follow us

|

Updated on: Aug 14, 2022 | 3:23 PM

తమిళ్ స్టార్ హీరోలంతా ఇప్పుడు తెలుగు దర్శకులతో పనిచేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ధనుష్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. అలాగే శివకార్తికేయన్ అనుదీప్ దర్శకత్వంలో ప్రిన్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దళపతి విజయ్(Thalapathy vijay )కూడా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మహర్షి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు ఓ పవర్ ఫుల్ కథతో దళపతితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వారసుడు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. వైజాగ్ షెడ్యూల్ లో హీరో , హీరోయిన్స్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాలో భారీ తారాగణం ఉండనుందని టాక్. తెలుగు తమిళ్ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ భావిస్తున్నారట. దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం టాలీవుడ్, కోలీవుడ్ లో ఉన్న దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి