Ram Charan: మెగాపవర్ స్టారా మజాకా.. చరణ్ లగ్జరీ వాచ్, స్టైలిష్ షూ, శాండల్స్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

|

Dec 18, 2022 | 4:50 PM

మెగాస్టార్ కొడుకుగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు చరణ్.

Ram Charan: మెగాపవర్ స్టారా మజాకా.. చరణ్ లగ్జరీ వాచ్, స్టైలిష్ షూ, శాండల్స్ ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
Ram Charan
Follow us on

రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ కొడుకుగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్.. ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు చరణ్. ఆ తర్వాత ధ్రువ, రంగస్థలం, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు. ఇక చరణ్ చేసింది తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం దేశవ్యాప్తంగా సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా చరణ్ ను నెస్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాలో తారక్ తో పోటీ పడి నటించాడు చరణ్. ఇదిలా ఉంటే చరణ్ ఔట్ ఫిట్ ఎప్పుడు సూపర్ స్టైలిష్ గా ఉంటుంది. సందర్భాన్ని బట్టి చరణ్ డ్రసింగ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాయల్ గా కనిపిస్తాడు చరణ్.

ఇదిలా ఉంటే చరణ్ కు సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. చరణ్ లావిషింగ్ హౌస్, లగ్జరీ కార్స్, హార్సెస్, పెట్స్, గాగుల్స్, వాచెస్ .. వాటి ధరలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల చరణ్ చేతికి ఉన్న వాచ్ , అలాగే షూస్ అండ్ శాండల్స్ అందరిని ఆకర్షిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

చరణ్ దహరించిన వాచ్ పేరు రిచర్డ్ మిల్లే వాచ్. దీని ధర రూ. 3,03,38,852. అలాగే చరణ్ వేసుకున్న షూస్ నైక్ వీటి ధర 3,60,971. అలాగే చరణ్ వాడే శాండల్స్ గూచి వీటి ధర రూ. 53,300. ఇక చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ షూటింగ్ దశలో ఉంది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.