Adipurush: రాముడు, కృష్ణుడు బాడీబిల్డర్లు కాదు.. ఆదిపురుష్ టీజర్ పై ఫైర్ అయిన శక్తిమాన్

ఆదిపురుష్‌ను విమర్శించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పురాణపురుషులను ట్రెండీ చూపించడం ఏంటనే ప్రశ్న అందరి నుంచి వస్తోంది.

Adipurush: రాముడు, కృష్ణుడు బాడీబిల్డర్లు కాదు.. ఆదిపురుష్ టీజర్ పై ఫైర్ అయిన శక్తిమాన్
Shaktimaan Mukesh Khanna, A
Follow us

|

Updated on: Oct 06, 2022 | 9:10 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ పై ఎదో ఒక వివాదం ముదురుతూనే ఉంది. ఇప్పటికే మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి ఈ టీజర్ పై మండిపడ్డ విషయం తెలిసిందే. ఆదిపురుష్‌ను విమర్శించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పురాణపురుషులను ట్రెండీ చూపించడం ఏంటనే ప్రశ్న అందరి నుంచి వస్తోంది. ఇక తాజాగా ఇదే విషయంపై శక్తిమాన్ ఫేమ్‌ ముఖేష్ ఖాన్నా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ , సైఫ్ ఆహార్యంపై ఆయన సీరియస్ గా మాట్లాడారు.  రాముడు, హనుమంతుడు, రావణాసురుడు కనపడలేదన్నారు. రాముడు, కృష్ణుడు అర్నాల్డ్ ష్క్వార్జ్‌ నెగర్‌లా ఉండరన్నారు ముఖే‌శ్ ఖన్నా. హిందూ దేవుళ్లు రాముడు, కృష్ణుడు వినయ, విధేయతలతో ఉంటారన్నారు. బాడీ బిల్డర్స్ రూపంలో ఉండరని, రామునికి, హనుమంతునికి అసలు మీసాలే ఉండవని అన్నారు.

రాముడు రాముడిలా, హనుమాన్‌ హనుమంతుడిలా కనిపించడం లేదు అని అన్నారు. ఇతిహాసగాథ రామాయణాన్ని ‘ఆదిపురుష్‌’ తరహాఓ తీస్తే కుదరదని ‘శక్తిమాన్’ పాత్రధారి ముఖేష్‌ ఖన్నా గట్టిగానే చెబుతున్నారు ముఖేష్‌ ఖన్నా తో యాక్టరస్ దీపికా చిక్లియా కూడా ఆదిపురుష్ టీజర్ పై స్పందించారు. సినిమాలో పాత్రలు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలన్నారు.. ఏ పాత్ర వేసినా.. అది ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలన్నారు.

దేవుళ్ళ మొహాల్లో కోమలమైన సౌందర్యం ఉంటుంది. సున్నితంగా, ఎంతో విధేయతతో ఉంటాయి. అంతే తప్ప గడ్డాలు, మీసాలు ఉండవు అని అన్నారు శక్తిమాన్. ఆదిపురుష్‌’ను ఫిక్షనల్‌ స్టోరీ అని చెప్పండి.. అంతేకానీ దయచేసి రామాయణం అని చెప్పకండి అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.