Hanuman Teaser: హనుమాన్ టీజర్ పై లెజండరీ దర్శకుడు ప్రశంసలు.. తమిళ్ డైరెక్టర్ అట్లీ సైతం ఫిదా..

ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది.

Hanuman Teaser: హనుమాన్ టీజర్ పై లెజండరీ దర్శకుడు ప్రశంసలు.. తమిళ్ డైరెక్టర్ అట్లీ సైతం ఫిదా..
Hanuman
Follow us

|

Updated on: Nov 26, 2022 | 4:52 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపించారు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రశంసలు కురిపించారు. ఇటీవల విడుదలైన హనుమాన్ టీజర్ చూసిన ఆయన.. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. యానిమేషన్ విజువల్స్, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని.. టీజర్ ఆరంభంలో భారీ హనుమంతుడి విగ్రహాన్ని చూస్తుంటే.. నిజంగానే ఆయన్ని చూస్తున్నామా అనిపించేలా ఉందని.. భక్తిభావం కలుగుతుందని అన్నారు.. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు హ్యాట్సాఫ్ అంటూ పొగిడారు. ఇక హనుమాన్ టీజర్ వీక్షించిన కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ సైతం ఫిదా అయ్యారు. పనితనం బాగుందని.. హనుమాన్ టీజర్.. మాస్సీ..క్లాసీ అని.. ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్టైనర్.. తేజా సజ్జా.. అమ్రిత సూపర్ వర్క్ అంటూ ట్వీట్ చేశారు.

ఇక టీజర్ విషయానికి వస్తే.. ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది. కొన్ని జీవురాశులు కొండపై ఒక కాంతిపుంజం చుట్టూ ప్రదక్షణం చేయడం ‘సుప్రీమ్ బీయింగ్’ రాకను సూచిస్తుంది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. అమృత అయ్యర్ భయపడుతూ చూడటం సూర్యగ్రహణం చెడు యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. వినయ్ రాయ్ ‘మ్యాన్ ఆఫ్ డూమ్’ గా భయపెట్టాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కొబ్బరిగెలతో విలన్స్ ని కొట్టే పెళ్లికూతురుగా ఎంట్రీ ఇచ్చింది. హనుమంతు అండర్‌ డాగ్‌ నుంచి సూపర్‌హీరోగా మారడం విజువల్ వండర్ గా వుంది. గద పట్టుకుని, కొండపై నిలబడి, హెలికాప్టర్‌ సమీపిస్తుండగా ఆకాశంలో ఎగురుతూ తన అతీత శక్తులను చూపిస్తూ.. హనుమంతుడు ఆవహించినట్లు కనిపిస్తోంది. హనుమ తపస్సు చేస్తూ, రామ నామం జపిస్తున్న చివరి విజువల్స్ మనసులో నాటుకునేలా వున్నాయి. ప్రశాంత్ వర్మ,అతని టీం మాస్టర్ వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 121 సెకన్ల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

ఇవి కూడా చదవండి

తెలుగులో తొలి జాంబీ చిత్రం జాంబీ రెడ్డి ని రూపొందించిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించాడు. టీజర్ సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకాయి. ఎప్పుడెప్పుడు సినిమాని బిగ్ స్క్రీన్‌లపై చూడాలనే ఆసక్తి నెలకొంది. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. .

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!